Dil raju : స్టార్ హీరోల పరువు తీసిన దిల్ రాజు..ఆ హీరోను ఎత్తేస్తూ..

- Advertisement -

Dil raju : ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..తెలుగు లో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు..అందులో కొన్ని రికార్డు స్థాయిలో హిట్ అయ్యాయి..ఇప్పటివరకు తెలుగు లో మాత్రమే తీసిన ఈయన తాజాగా తమిళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు..వారిసు అనే చిత్రాన్ని తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు..ఈ సినిమా ద్వారా దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కోలివుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. వారిసు సినిమాను జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

Dil raju
Dil raju

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించారు..ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..దిల్ రాజు నిర్మిస్తున్న వారిసు చిత్రానికి సంబంధించి థియేటర్ల వివాదం టాలీవుడ్‌లో గట్టిగానే నడుస్తున్నది. వారిసుతోపాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అలాగే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డితోపాటు అజిత్ నటించిన తెగింపు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయితే బాలయ్య, చిరంజీవి సినిమాలకు థియేటర్లు ఇవ్వమనని ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది..అంతే కాదు దిల్ రాజు అంటే ఏంటో అందరికి చూపిస్తాను అంటూ చాలెంజ్ చేశారు..

Movie Proucer Dil Raju
Movie Proucer Dil Raju

ఒక పక్క ఏపీ, తెలంగాణలో థియేటర్ల వ్యవహారం, వివాదం జోరుగా కొనసాగుతుండగానే.. దిల్ రాజు చెన్నైలో వారిసు ఆడియో లాంచ్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది తరలివచ్చారు. స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభిమానులతో కిక్కిరిసిపోయింది..అదే విధంగా దిల్ రాజ్ విజయ్ వ్యక్తిత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు..ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..విజయ్ సూపర్ స్టార్.. నంబర్‌వన్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా సంక్రాంతికి బిగ్ బ్లాక్‌బస్టర్. తమిళంలోనే కాదు. తెలుగు, ఉత్తరాదిలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని రాసిపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంటుంది…ప్రేక్షకులకు ఎం కావాలో విజయ్ లో అవి ఉన్నాయని ఆయన అన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here