SS Rajamouli జాక్ పాట్.. జక్కన్నకు అవతార్ డైరెక్టర్ క్రేజీ ఆఫర్

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు SS Rajamouli రేంజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఒక్కసారిగా జక్కన్న పేరు విదేశాల్లోనూ మార్మోగింది. తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు ఎస్ ఎస్ రాజమౌళి. ఇటీవల ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆర్ఆర్ఆర్ టీమ్ కుటుంబ సమేతంగా లాస్ ఏంజెల్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.

When James Cameron meets SS Rajamouli
When James Cameron meets SS Rajamouli

అయితే అక్కడ ఓ పార్టీలో రాజమౌళి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ను కలిశారు.  జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి జక్కన్నతో మాట్లాడారు. తన భార్యకు ఆ సినిమా ఎంతో నచ్చిందని చెప్పారు. అంతే కాకుండా ఈ హాలీవుడ్ దిగ్గజం రాజమౌళికి ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసి ఫిదా అయిన ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా జక్కన్నకు హాలీవుడ్‌లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని కోరారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నెటిజన్లతో పంచుకుంది. 

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి కలిసిన విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్‌ వివరణాత్మకంగా జక్కన్నకు తెలియజేశారు. ఈ చిత్రాన్ని కామెరూన్‌ రెండుసార్లు చూసినట్లు ఆయన సతీమణి సుజీ కామెరూన్‌ వెల్లడించారు. వీరిద్దరి మాటలతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ శనివారం విడుదల చేసింది.

- Advertisement -

రాజమౌళి: టెర్మినేటర్‌’, ‘అవతార్‌’, ‘టైటానిక్‌’.. ఇలా మీరు తెరకెక్కించిన అన్ని చిత్రాలను నేను చూశాను. అవి నాలో స్ఫూర్తి నింపాయి. మీ వర్క్ అంటే నాకెంతో ఇష్టం.

కామెరూన్‌: మీరు తెరకెక్కించిన చిత్రాలు, అందులోని పాత్రలు చూస్తుంటే విభిన్నమైన అనుభూతి కలిగింది. నిప్పు, నీరు, కథ.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి మీరు చూపించిన విధానం, బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీని చెప్పిన తీరు నాకెంతో నచ్చింది. స్నేహం, వైరాన్ని చూపించిన సన్నివేశాలు.. వావ్‌ అనేలా ఉన్నాయి.

రాజమౌళి: మీ నుంచి వచ్చిన ఈ మాటలు నాకు అవార్డుల కంటే ఎంతో ఎక్కువ. నేను తెరకెక్కించిన చిత్రాన్ని మీరు చూసి, దాన్ని ఇలా విశ్లేషించడాన్ని ఓ మై గాడ్‌.. నమ్మలేకపోతున్నా.

సుజీ కామెరూన్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఆయన రెండుసార్లు చూశారు. మొదటిసారి ఆయన ఒక్కరే చూశారు. తర్వాత మేమిద్దరం కలిసి చూశాం. సినిమా చూస్తున్నంతసేపు.. ప్రతి సీన్‌ను ఆయనే ముందు చెప్పేశారు.

కామెరూన్‌: షూట్‌కు ఎంతకాలం పట్టింది.

రాజమౌళి: 320 రోజులు.

కామెరూన్‌: మీరే కదా ఈచిత్రానికి సంగీతం అందించింది. మిమ్మల్ని నేను గోల్డెన్‌ గ్లోబ్స్‌లో చూశాను.

కీరవాణి: థ్యాంక్యూ సర్‌.

కామెరూన్‌: సంగీతం ఎంతో బాగుంది. కొన్ని సన్నివేశాలకు నేను లేచి నిల్చొన్నాను. మీరు మరెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here