SS Rajamouli : ఆ విషయంలో రాజమౌళి బాధతో కుమిలిపోతున్నారట

- Advertisement -

దర్శకధీరుడు.. టాలీవుడ్​ జక్కన్న.. SS Rajamouli.. ఒకప్పుడు బుల్లితెరకే పరిచయమైన పేరు.. ఆ తర్వాత వెండితెర మీద కనిపించింది. ఇక వెండితెరపై అడుగుపెట్టిన తొలి క్షణం నుంచి మొదలైన పరుగు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్​వుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈగ వంటి సినిమాతో దక్షిణాదిన జక్కన్న పేరు మార్మోగింది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి మూవీతో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ దర్శకుడు అనిపించుకున్నారు.

బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ చిత్రాల సంచలన విజయాలతో గ్లోబర్​ స్టార్​గా మారారు రాజమౌళి. ఇండియన్​ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. పాన్ ఇండియా రేంజ్​లో విడుదలైన ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా వసూళ్లలోనూ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా అవతార్ సినిమా డైరెక్టర్​ ఈ చిత్రం గురించి ప్రశంసలు కురిపించారంటే ఆర్ఆర్ఆర్ సినిమా స్థాయి ఏంటో.. రాజమౌళి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడి.. దర్శకత్వ శైలి, సృజన్మాతక ప్రయాణం తదితర ఆసక్తికర అంశాలతో ఓ డాక్యుమెంట్‌ సిరీస్‌ రూపొందనున్నట్లు అధికార్ ప్రకటన వచ్చింది. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫిల్మ్‌ కంపానియన్‌ సంస్థలు ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ పేరుతో ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. ఇందులో తొలి భాగంలో రాజమౌళి కనిపించనున్నారు. ఇప్పటికే రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇక ఈ డాక్యుమెంటరీతో రాజమౌళి టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
Rajamouli
Rajamouli

ఇంతటి ఖ్యాతి గడించిన జక్కన్న ఓ విషయంలో చాలా బాధతో కుమిలిపోతున్నారట. అదేంటంటే.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం భారతదేశం తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడం. ఈ విషయంలో తాను బాధపడ్డానని జక్కన్న అన్నారు.

“దేశం తరఫు నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడం వల్ల నిరాశ చెందాను. అయితే ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అంటూ ఆలోచించే వ్యక్తిని కాదు. మనం ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి లాస్ట్‌ ఫిల్మ్‌ షో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నందుకు సంతోషిస్తన్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ అధికారికంగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎలా ఉంటుంది? దాని నియమ నిబంధనలు ఏమిటి? అనేది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్‌ చేయాలనుకోవడం లేదు” అని జక్కన్న వివరించారు.

కాగా, ఆర్​ఆర్​ఆర్​లో సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, ఆస్టిస్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌, బోస్టస్‌ సోసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌ వంటి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకుంది.

ఇక ఆస్కార్​ మాత్రమే మిగిలింది. అయితే ఈ సినిమాలోని నాటునాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ఇకపోతే మన దేశం తరఫు నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. జనవరి 24న నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాల పేర్లను ప్రకటించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here