Unstoppable With NBK S2 : అన్‌స్టాపబుల్‌ పవర్ స్టార్ ఎపిసోడ్ లో మరో గెస్టు.. ఎవరో తెలుసా..?

Unstoppable With NBK S2


Unstoppable With NBK S2 : నందమూరి బాలకృష్ణ బుల్లితెరపై చేస్తున్న మ్యాజికల్ షో అన్ స్టాపబుల్. ఈ షో మొదటి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఆహా టీమ్ రెండో సీజన్ షురూ చేసింది. ఇక సెకండ్ సీజన్ కూడా క్రేజీ కాంబో గెస్టులతో ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులను అలరిస్తోంది.

Unstoppable with NBK Season 2

ఇక ఈ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆహా తాజాగా ప్రోమో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రోమో రిలీజ్ అయిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కూడా ఉంది. 

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రాజుకుంటున్న వేళ ఒకే వేదికపై బాలకృష్ణ.. పవన్ కల్యాణ్ కనిపించడంతో ఈ ఎపిసోడ్ మరింత ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు. పవన్ ఎపిసోడ్.. ప్రభాస్ ఎపిసోడ్ కంటే హై రేంజ్ లో వర్కౌట్ అవుతుందని ప్రోమోతో అర్థమైపోయింది.

అయితే పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు దాదాపు ఈ షోకు సింగిల్ గా కాకుండా కాంబోగా గెస్టులు వచ్చారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ ఎపిసోడ్ లో కూడా అదే జరగబోతోందట. అయితే పవన్ తో ఎవరొస్తున్నారో తెలుసా.. ఇంకెవరు పవన్ కల్యాణ్ మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. దీనికి సంబంధించిన ఫొటో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Unstoppable with NBK Season 2

అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం సింపుల్ గా పంచె కట్టుతో కనిపించడం విశేషం. పవన్ కల్యాణ్ తో తేజ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సక్సెస్ అయిన వినోదయ సీతమ్ రీమేక్ లో వీళ్లిద్దరు కలిసి నటించబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా కంటే ముందు ఈ మామా అల్లుళ్లు అన్ స్టాపబుల్ షోలో కలిసి కనిపించనున్నారట. 

Pawan Kalyan Unstoppable With NBK S2
Pawan Kalyan Unstoppable With NBK S2

నేను అందిరిని నన్ను బాలా అని పిలవమంటాను అని బాలయ్య అనగానే.. దానికి పవర్ స్టార్ నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ నన్ను అలా పిలవమనకండి అని అంటుండగానే ఈ పాలిటిక్సే వద్దంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు. ఈ మధ్య పాలిటిక్స్ లో విమర్శల్లో వాడి వేడి బాగా డబుల్ ఇంపాక్ట్ అయిందని బాలకృష్ణ అనగా.. లేదండి నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నానని పవన్ కల్యాణ్ బదులిచ్చారు. 

చిరంజీవి నుంచి మీరేం నేర్చుకున్నారు.. ఏం వద్దనుకున్నారు అని బాలయ్య పవన్ ను అడిగారు. మరోవైపు పవన్ కల్యాణ్ తాను ఓ సినిమా గురించి చిరంజీవి భార్య సురేఖకు చెబుతూ.. వదినా నేను ఇదే చివరి సినిమా అనుకుంటున్నాను.. తర్వాత చేయననుకుంటున్నాను అని చెప్పానని చెప్పారు. ఇంతకీ అదేం సినిమానో తెలుసుకోవాలంటే పవర్ స్టార్ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

బాలయ్య పవన్ కల్యాణ్ ను.. రాష్ట్రమంతా నీకు అభిమానులే కానీ ఆ అభిమానం ఓట్లుగా ఎందుకు కన్ వర్ట్ కాలేదని మీ ఉద్దేశం అని అడిగారు దీనికి పవన్ కల్యాణ్ సమాధానమేంటో చూడాలి. ఇక ప్రోమో చివరలో బాలయ్య, పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.. బాలయ్య.. మేం బ్యాడ్ బాయ్స్.. 1..2.3.4.5.6.7.8.9 10 అని చెప్పారు. ఇక ప్రోమో చివర్లో పవన్ వాయిస్ లో వచ్చే మనల్నెవడు భయపెట్టేటోడు అంటూ వచ్చే డైలాగ్ హైలైట్.