ఆ ఒక్క మాటే JR NTR – Balakrishna ల గొడవకు కారణమా?JR NTR – Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి స్థాయి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ను నిలబెట్టిన ఘనుడు.. ఈరోజు సినీ ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉందంటే అదంతా ఆయన కృషి ,పట్టుదల ఫలితమే అని చెప్పుకోవాలి.. ఇక ఆయన తర్వాత వారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. తండ్రికి తగ్గ కొడుకుగా రాణిస్తూ బాగానే పేరు సంపాదించుకున్నారు. మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే.. ఆయన నందమూరి హోదాను పెంచుతున్నాడు..

JR NTR - Balakrishna
JR NTR – Balakrishna

ఇదిలా ఉండగా బాలయ్యకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ జరుగుతోంది. దీనిపై ఇంటర్నెట్ లో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. కానీ వీటికి ఏ ఒక్కరు స్పందించక పోవడంతో అది నిజమే అనుకున్నారు అందరు.. అందుకు కారణాలు కూడా లేకపోలేదట.. ఎన్నోసార్లు బాలయ్య కావాలనే జూనియర్ ఎన్టీఆర్ను అవమానించారు.

అంతేకాదు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ను ఇన్ డైరెక్ట్ గా తిట్టారట.. అయితే ఈ విషయంపై ఒక సీనియర్ జర్నలిస్టు బాలకృష్ణ కావాలని జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే అవమానించాడు అంటూ సంచలన విషయాలు వెల్లడించారు.. ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్ కు తన తల్లిని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు.

అయితే అదే సమయంలో అందరి ముందే బాలయ్య వారిని బయటకు పొమ్మంటూ చెప్పారట. చేసేదిలేక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని బయటకు వచ్చేసాడు కాగా ఆ తర్వాత కాలంలో జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో అయిపోయాడు.

అప్పుడు బాలయ్యే స్వయంగా తన సినిమా ఫంక్షన్ కి పిలిచి దగ్గరకు తీసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం రాజకీయంగా మళ్ళీ వేరువేరుగా చూస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే బాలకృష్ణ .. ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని అర్థమవుతుంది. ఏదేమైనా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. మరి అబ్బాయి బాబాయ్ లు కలుస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది…

Tags: