Unstoppable With NBK : ప్రశ్నలు సూటిగా.. ఆన్సర్ ఘాటుగా..

pawan kalyan unstoppable with nbk


Unstoppable With NBK : నందమూరి బాలయ్య హోస్ట్ గా చేసిన సంచలనాలకు కేరాఫ్ గా మారుతుంది. ఇక పవన్ కళ్యాణ్ వంటి మితభాషి గెస్ట్ గా రావడంతో షోకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఆయన ఒక స్టార్ హీరో మరియు పొలిటిషియన్ కావడంతో షో పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.. దీంతో షో పై జనాల్లో ఆసక్తి పెరిగింది.. అనుకున్నట్లుగానే ఆహా పవన్ ఎపిసోడ్స్ పై మరింత హైప్ ను క్రియేట్ చేశారు..

బాలయ్య వేసిన సూటి ప్రశ్నలకు.. పవన్ కళ్యాణ్ ఆన్సర్ కు ఘాటుగా ఉన్నాయి.. ఆయన జీవితంలో అనేక వివాదాలు, సమాధానం లేని ప్రశ్నలు, ప్రత్యర్థుల ఆరోపణలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండగా… వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఆ ఉద్దేశంతోనే అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టారు.

pawan kalyan unstoppable with nbk
pawan kalyan unstoppable with nbk

ఊహించినట్లే కొన్ని వివాదాస్పద ప్రశ్నలు చర్చకు వచ్చాయి. ఎపిసోడ్ పార్ట్ 1లో పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం చర్చకు వచ్చింది. దానికి ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. నేనేమీ సరదా పడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. ఒకరితో మరొకరికి కుదరనప్పుడు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నానని సమాధానం చెప్పారు. దాంతో పాటు సినిమాల్లోకి రావాలనే నిర్ణయం ఎవరిది? వచ్చాక జరిగిన మానసిక సంఘర్షణ?..అన్నయ్య చిరంజీవి ఫ్యామిలీతో సాన్నిహిత్యం, సంబంధాలు… వంటి ఆసక్తికర సంగతులను పవన్ పంచుకున్నారు.

unstoppable with nbk

ఇది ఇలా ఉండగా..సెకండ్ పార్ట్ లో మరిన్ని విశేషాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా పొలిటికల్ ఆరోపణలు పై ఆయన నోరు విప్పాడట. బాలకృష్ణ అడిగిన ఘాటైన ప్రశ్నలకు పవన్ పవర్ ఫుల్ ఆన్సర్స్ ఇచ్చారట.. ఫిబ్రవరి 9 రాత్రి నుంచి అన్‏స్టాపబుల్ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది..

ఏపీ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు అధికార పార్టీకి చురకలను అంటించింది.. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక జనసేన పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది.. పార్టీలో చేరికలు కూడా పెరిగాయి దీంతో 2024 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.. చూడాలి ప్రజలు ఎవరికీ అధికారాన్ని ఇస్తారో..