Unstoppable With NBK : ‘అన్ స్టాపబుల్’ పార్ట్ 2 మసాలా బాగా దట్టించారుగా.. షో అభి బాకీ హై..

unstoppable with nbk


Unstoppable With NBK : అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 1 ఇటీవలే విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే..ఈ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కారణంగా రికార్డ్స్ అయితే వచ్చాయి కానీ, ఆసక్తికరమైన ప్రశ్నలు అడగలేదని, ఎపిసోడ్ లో కంటెంట్ పెద్దగా ఏమి లేదని అభిమానులు చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Unstoppable with NBK
Pawan Kalyan Unstoppable with NBK

అయితే పార్ట్ 2 మాత్రం ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో అవన్నీ ఉంటాయని, పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చారు.. ఫిబ్రవరి 10 వ తారీఖున ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఒక ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.. ఈ ప్రోమో కి మొదటి ఎపిసోడ్ మొత్తనికంటే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.. పవన్ కళ్యాణ్ ని ఎలాంటి ప్రశ్నలు అయితే అడగాలో అలాంటి ప్రశ్నలే అడిగాడు బాలయ్య.

Pawan Kalyan unstoppable

ఉత్తరాంధ్ర పర్యటన లో పవన్ కళ్యాణ్ ని కట్టడి చెయ్యడానికి వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యం గురించి, పోటీ చేసిన రెండు స్థానాలలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్న కూడా అడిగాడు..అంతే కాదు ‘పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు మానేసి ప్రజాజీవితం కి అంకితం కావాలి ‘ అని అడుగుతాడు.. దానికి ఆడియన్స్ మొత్తం అవును అని రియాక్షన్ ఇస్తారు.. ఇదంతా చూస్తూ ఉంటే ఎపిసోడ్ చాలా ఆసక్తిగా కొనసాగబోతుంది అని అర్థం అవుతుంది..అంతే కాదు తెలుగు దేశం పార్టీ తో పొత్తు ఉందా లేదా అనేది కూడా ఈ ఎపిసోడ్ తో తేలిపోనుంది.

Pawan Kalyan Unstoppable with nbk

ఇక ఇప్పటం గ్రామం లో ప్రజల ఇళ్లను అక్రమంగా కూల్చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.. అందులో ఒక ముసలావిడ ఇంటిని కూల్చేయడం, ఆమె మీడియా ముందుకు వచ్చి బోరుమని ఏడవడం ,పవన్ కళ్యాణ్ ఆ గ్రామప్రజలు అండగా నిలబడడం వంటివి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి.. ఆ ముసలావిడ ఈ షో కి రావడం హైలైట్ గా నిలిచింది.. నా బిడ్డని సీఎం గా చూసి చనిపోతాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసాయి.. మొత్తానికి ‘అన్ స్టాపబుల్’ పార్ట్ 2 బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ లోడింగ్ అన్నమాట.

Tags: