‘చంద్రముఖి’ సినిమాని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా..? ఇలాంటి ఛాన్స్ ఎలా మిస్ అయ్యాడో!సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో హారర్ జానర్ సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిల్లో చంద్ర ముఖి ఒక్కటి. కన్నడ లో అప్పట్లో ‘ఆప్తమిత్ర’ అనే సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమాలో హీరోగా విష్ణు వర్ధన్ నటించాడు, ఈ సినిమా రీమేక్ రైట్స్ ని ప్రముఖ తమిళ హీరో ప్రభు కొనుగోలు చేసాడు. రజినీకాంత్ ని ఇందులో హీరో గా పెట్టి తీయాలనేది ఆయన కోరిక.

వెంటనే రజినీకాంత్ కి ఫోన్ చేసి ‘ఆప్తమిత్ర’ సినిమా చూడు, దీనిని మనం రీమేక్ చేస్తున్నాం, నీకు చాలా బాగా సూట్ అవుతుంది అని అన్నాడట . రజినీకాంత్ ప్రభు మాటని గౌరవించి ఆ చిత్రాన్ని చూసాడు, వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అప్పటికే ‘బాబా’ సినిమా ఫ్లాప్ తో డల్ గా మారిన రజినీకాంత్ కెరీర్, ‘చంద్రముఖి’ సినిమాతో పూర్వ వైభవం వచ్చింది.

చంద్రముఖి
చంద్రముఖి

కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఈ సినిమా పెద్ద హిట్. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని తొలుత ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసి , మెగాస్టార్ చిరంజీవి తో చెయ్యాలని అనుకున్నాడు. కానీ చిరంజీవి నాకు ఇలాంటి సినిమాలు సూట్ అవ్వవు అని, గతం లో తన ఇమేజి ని పక్కన పెట్టి ‘అంజి’ అనే సినిమా చేసి చేతులు కాల్చుకున్నాను అని, మళ్ళీ అలాంటి రిస్క్ చేయలేనని చిరంజీవి మొహం మీదనే చెప్పేశాడట.

Chiranjeevi

అలా ఈ ప్రాజెక్ట్ చిరంజీవి నుండి మిస్ అయ్యింది. ఇక అశ్విని దత్ కూడా రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసే ఆలోచనని పక్కన పెట్టేసాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది, ప్రారంభం లో ఈ సినిమాకి పెద్దగా టాక్ రాలేదు కానీ, రెండవ వారం నుండి ఊహించని పాజిటివ్ టాక్ అందుకొని, ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ వసూళ్లను రాబట్టింది.

rajinikanth