కీర్తి సురేష్ గొంతు పిసికేసిన మెగాస్టార్ చిరంజీవి..వైరల్ అవుతున్న వీడియో

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది, ఆగస్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఇప్పటి నుండే ప్రారంభించేసింది మూవీ టీం. ఇక సోషల్ మీడియా ని తన సినిమా కోసం పెర్ఫెక్టుగా వాడుకునే చిరంజీవి, ఈ సినిమాకి హైప్ పెంచేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

చిరంజీవి
చిరంజీవి

ప్రస్తుతం ఈ సినిమాలో వచ్చే సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన పాటని చిత్రీకరిస్తున్నారు. మూవీ లో పని చేసిన ప్రతీ ఆర్టిస్టు ఈ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి చిందులు వేస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే చిరంజీవి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ పాట షూటింగ్ కి సంబంధించిన వీడియో ని విడుదల చేసాడు. చిరంజీవి తో పాటుగా కీర్తి సురేష్, తమన్నా, గెటప్ శీను, హైపర్ ఆది, సుశాంత్ తదితరులు ఈ వీడియో లో కనిపిస్తున్నారు.

Bhola Shakar

ఈ వీడియో మొత్తం చిరంజీవి చిలిపి చేష్టలతో నిండిపోయింది, ప్రతీ ఆర్టిస్టుతో ఆయన కలిసి పోయి మాట్లాడడం వంటివి చాలా క్యూట్ గా అనిపించాయి. ఇక ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్న శేఖర్ మాస్టర్ తో ఆయన జోకులు వెయ్యడం, దానికి శేఖర్ మాస్టర్ పగలబడి నవ్వడం వంటివి చూసేందుకు చాలా బాగా అనిపించింది. ఇక తమన్నా మరియు కీర్తి సురేష్ తో చిరంజీవి చేసిన అల్లరి కూడా హైలైట్ గా నిలిచింది.

- Advertisement -
CHiranjeevi bhola shankar

వాళ్ళతో జోకులు వెయ్యడం, కీర్తి సురేష్ ని కొట్టేవిధంగా చిరంజీవి నాలుక మడతపెట్టడం, ఆ తర్వాత ఆమె గొంతు పిసకడం వంటివి ఈ వీడియో లో హైలైట్ గా నిలిచాయి. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి. ఈ చిత్రం లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది, ఆమెకి జోడిగా సుశాంత్ నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here