వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో పవన్ కల్యాణ్ షాకింగ్ లుక్స్.. త్రివిక్రమ్ చెప్పింది ఇదేనట..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. వెండితెరపై రీల్ కపుల్ గా కనువిందు చేసిన ఈ జంట త్వరలో రియల్ కపుల్ కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ తో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో మెగా హీరోలు, అల్లు హీరోలు సందడి చేశారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

అందరూ వరుణ్ తేజ్, లావణ్య జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక కు సంబంధించి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వీటిని చూసినవారంతా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులు వీరిద్దరి జంటను చూడ ముచ్చటైన జంటగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో #VarunLav హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగనున్నట్టు సమాచారం.

Pawan Kalyan

ఇక ఈ వేడకకు పవన్ కల్యాణ్ షాకింగ్ లుక్స్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు షేర్ చేసిన త్రివిక్రమ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లో పవన్ కల్యాణ్ లుక్స్ ఇవే అని చెప్పి లీక్ చేశారు. ఇందులో పవన్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని స్టైలిష్ గా కనిపించాడు. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.