మెగా ఫ్యామిలీ పెట్టిన పెద్ద కండీషన్ కు ఒప్పుకున్న లావణ్యత్రిపాఠి.. షాక్ లో ఫ్యాన్స్గత కొంత కాలంగా మెగా హీరో వరుణ్‌ తేజ్ ,లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుండగా.. పలువురు ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

లావణ్యత్రిపాఠి
లావణ్యత్రిపాఠి

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు. ఈ మేరకు వరుణ్ తేజ్ లావణ్యతో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి నా లవ్ దొరికింది అంటూ స్పెషల్ గా పోస్ట్ చేశాడు.

Lavanya Tripathi Varun Tej

అయితే, మెగా కోడలిగా రాబోతున్న లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే కండీషన్ పెట్టారంట. అందుకు యూపీ బ్యూటీ త్రిపాఠి కూడా ఓకే చెప్పిందని, తర్వాతే గ్రాండ్ గా నిశ్చితార్థపు వేడుక జరిగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిలో వాస్తవం ఎంతున్నదనే మున్ముందు చూడాలి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఘనంగా జరగనుందని తెలుస్తోంది. ఇటలీలో పెళ్లి జరగనుందని అంటున్నారు. ఆలోపు ప్రస్తుతం తన చేతిలో ఉన్న చిత్రాలను కూడా కంప్లీ చేయనుందంట. ప్రస్తుతం లావణ్య తమిళంలో ‘తనల్’ చిత్రంలో నటిస్తోంది. చివరిగా ‘పులి మేక’ సిరీస్ తో అలరించింది.