The Elephant Whisperers : అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ లో మన ఇండియన్ సినిమాలు ఇప్పుడు సత్తా చాటడం యావత్తు ఇండియన్ సినీ అభిమానులకు గూస్ బంప్స్ ని రప్పిస్తున్నాయి.గతం లో ఎక్కువగా అంగ్ల చిత్రాలకే ఆస్కార్ అవార్డ్స్ వస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు మన ఇండియన్ సినిమాల డామినేషన్ మొదలైంది.రాబొయ్యే రోజుల్లో ఈ డామినేషన్ తార స్థాయిలో ఉండబోతున్నాయనే సంకేతాలు ఇప్పటి నుండే అందుతున్నాయి.

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం నేడు లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది.ఈ వేడుక లో మన తెలుగు సినిమా #RRR కి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో నామినేషన్ దక్కిన సంగతి తెలిసిందే.ఆ సినిమాతో పాటుగా తమిళం లో తెరకెక్కిన ఒక షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విష్ప్ర్స్’ అనే చిత్రానికి కూడా నామినేషన్స్ లో ‘బెస్ట్ షార్ట్ ఫిలిం’ క్యాటగిరీ లో నామినేషన్ దక్కింది.

అయితే #RRR మూవీ కి ముందే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కడం అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది.ఈ చిత్రం నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడమే పెద్ద ఘనత గా భావించిన ప్రేక్షకులు ,ఇప్పుడు ఈ చిత్రానికి ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కడాన్ని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.ఈ లఘు చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది.కార్తీక్ గొంసాల్వేస్ అనే నూతన తమిళ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

కేవలం 45 నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు , హిందీ, తమిళం మరియు మలయాళం బాషలలో అందుబాటులో ఉన్నది. ఇంత తక్కువ నిడివి సమయం లో ఈ ఏనుగుతో ఒక కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఎంత చక్కగా చూపించాలో అంత చక్కగా చూపించాడు డైరెక్టర్. కచ్చితంగా ఇది ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది , చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజెయ్యండి.