మరో మాస్ స్ట్రీక్ పోస్టర్ ని వదిలిన ‘గుంటూరు కారం’ మేకర్స్.. ఈసారి బాక్స్ ఆఫీస్ వేట మాములుగా ఉండదు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా గత కొంతకాలం క్రితం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ గత కొంతకాలం క్రితమే విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారం
గుంటూరు కారం

ఇప్పుడు మే 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. అదే రోజున కృష్ణ హీరో గా నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఆ థియేటర్స్ అన్నిట్లో ‘గుంటూరు కారం’ గ్లిమ్స్ వీడియో ప్లే అవ్వబోతుంది.

ఈ గ్లిమ్స్ వీడియో మరో రెండు రోజుల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం గా మేకర్స్ మరో సరికొత్త మాస్ స్ట్రీక్ పోస్టర్ ని విడుదల చేసారు. తల కి రెడ్ బ్యాండ్ కట్టుకొని నెలకు దండం పెడుతూ బరిలోకి దిగబోతున్నట్టుగా మహేష్ బాబు ఇచ్చిన ఫోజుకి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

ఇది కదా మేము ఇన్ని రోజులు కావాలని కోరుకున్న మహేష్ బాబు. మా మాస్ మహేష్ బాబు ని తిరిగి ఇచ్చేసినందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ధన్యవాదాలు, సంక్రాంతికి ఎవరొస్తారో రండి , తొక్కి పారేస్తాం అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి తాత్కాలిక విరామం ఇచ్చి మహేష్ విదేశీ పర్యటన కి బయలుదేరాడు. జూన్ మొదటి వారం నుండి ప్రారంభం కాబోయే సరికొత్త షెడ్యూల్ లో ఆయన పాల్గొనబోతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here