ఎన్టీఆర్ ఫొటోకు హారతి ఇచ్చిన సునీషిత్.. వీడియో వైరల్

- Advertisement -

సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..తెలుగులోని స్టార్ హీరోలందరిపైనా రకరకాల కామెంట్లు చేశాడు. తాను త్యాగం చేయడం వల్ల ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలయ్యారని అన్నాడు. స్టార్ హీరోలందరూ తన ఫ్రెండ్సేనని చెప్పుకు తిరిగాడు. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలేనని చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు… కాకపోతే ఛానెల్స్ క్రేజ్ కోసం అతన్ని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నారు..మొన్న మెగా ఫ్యాన్స్ తో తన్నులు తిన్న ఇతను.. మరోసారి నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైయ్యాడు.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

సునీషిత్
సునీషిత్

ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తప్పుగా మాట్లాడటంతో సునిశిత్‌ను చరణ్ ఫ్యాన్స్ చితకబాదారు. ఇంకెప్పుడూ రామ్ చరణ్, ఉపాసన‌తో పాటు సినిమా పరిశ్రమలో ఏ ఒక్కరిపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. ఆ వీడియో వైరల్ కావడంతో నందమూరి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చితకాబాదారు..ఆఖరిలో కొన్ని డబ్బులు ఇచ్చి బుద్ధిగా బతకమని చెప్పారు. ఈ వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి..ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..

జూనియర్ ఎన్టీఆర్‌పై సునిశిత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన సునిశిత్.. ఆయన ఎంత పెద్ద హీరో అయినా గతంలో కొన్ని పోర్న్ సినిమాల్లో నటించారని చెప్పాడు.. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. మొత్తానికి సునిశిత్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టేశారు. అప్పటికే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న సునిశిత్‌ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమీ చేయలేదట.. కాకపోతే కాస్త వెరైటీగా అతనికి బుద్ది చెప్పినట్లు తెలుస్తుంది.. ఎన్టీఆర్ ఫోటోను తీసుకొచ్చి అతనితో హారతి ఇప్పించారు..ఆ వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here