Guess Actress : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి.. నేటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా.!?

Guess Actress


Guess Actress : పాత ఫోటోలు ఎప్పుడు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి.. అందుకే ఈ మధ్య కాలంలో ‘Throwback Thursday’ ట్రెండ్ ఎక్కువైంది.. ఈ ట్యాగ్‌తో సినీ సెలెబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..

పైన ఉన్న ఫోటోలోని చిన్నారికి ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోయిన్ గా పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది.. 100 కోట్ల కలెక్షన్ వసూలు చేసిన సినిమాలులో టాప్ ఈ అమ్మడు.. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది అటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో సైతం తన మార్క్ ని చూపించింది.. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా.!? బహుశా మీకు ఈపాటికి అర్థం అయిపోయింది అనుకుంటా.. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..

Guess Actress
Guess Actress

సమంత పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. దాంతో సమంతా చిన్నప్పుడు ఫోటోలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో సమంత ముద్దుగా బొద్దుగా ఉంది. మల్లెపూలు పెట్టుకొని కనిపించింది. చిన్నప్పుడే ఎంత క్యూట్ గా ఉందో కదా అనిపిస్తుంది సమంత.. వీటితో మరి కొన్ని పాత ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Samantha CHildhood Photos

సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంతా నటించిన యశోద సినిమా హిట్ అయింది. కాగా సమంత నటించిన లేటెస్ట్ చిత్రం శాకుంతలం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. అంతేకాకుండా సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది.