Pathaan Collections : రెండు రోజుల్లో 180 కోట్లు.. ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొడుతున్న ‘పఠాన్’

- Advertisement -

Pathaan Collections : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేసిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పఠాన్‘ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘానంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. తమ అభిమాన హీరో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆకలితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి విందు భోజనం పెట్టాడు షారుఖ్ ఖాన్.

మొదటి రోజు ఈ చిత్రానికి 104 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ మరియు 55 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.. ఇదేమి క్రేజ్ రా బాబు అంటూ ట్రేడ్ పండితులకు సైతం మాత్తిపొయ్యేలా చేసింది ఈ సినిమా ఓపెనింగ్స్.. ఇక రెండవ రోజు రిపబ్లిక్ డే అవ్వడం తో చాలా ప్రాంతాలలో మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

Pathaan Collections
Pathaan Collections

ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలలో ఈ సినిమాకి టికెట్ ముక్క కూడా దొరకడం లేదు.. ఇక హైదరాబాద్ వంటి నగరాలలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది.. ప్రస్తుతం నడుస్తున్న ఈ ట్రెండ్ ని చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ చిత్రం నేడు 80 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు..

- Advertisement -

మరికొంత మంది ట్రేడ్ పండితులు చెప్తున్న మాట ఏమిటంటే రెండవ రోజు వంద కోట్ల రూపాయిలకు పైగా వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. రెండు రోజులకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి,100 కోట్ల రూపాయిలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.. ఇదే ఊపు కొనసాగిస్తే ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.. చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here