Shahrukh Khan : సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ గురించి ఫ్యాన్స్‌కు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ల లైఫ్‌లో ఏం జరుగుతోందన్న విషయం నుంచి వాళ్లు వేసుకునే బట్టలు.. ధరించే యాక్సెసరీస్ ఇలా అన్నింటిపై అభిమానుల ఫోకస్ ఉంటుంది. కొన్నిసార్లు సెలబ్రిటీల అట్టైర్ బాగా నచ్చి.. వారు ధరించిన ఔట్ఫిట్స్, యాక్సెసరీస్ గురించి ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటారు. వాళ్ల అభిమాన తారల్లానే తాము రెడీ కావాలనుకుంటారు. కానీ వాటి ధర తెలిశాక నోరెళ్లబెడతారు.
ఈ ఫోకస్ ఎక్కువ హీరోయిన్లపైనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు హీరోలపైన కూడా ఫ్యాన్స్ కాన్సంట్రేట్ చేస్తారు. ముఖ్యంగా అబ్బాయిలైతే తమ అభిమాన హీరో ధరించి షర్ట్, వాచ్, షూస్ ఇలా వాళ్ల యాక్సెసరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. తమ ఫేవరెట్ హీరో ఏదైనా టీ షర్ట్, జాకెట్ లేదా హుడీ ధరించి బయటకొస్తే.. అది నచ్చితే ఫ్యాన్స్ ఆ బ్రాండ్ ఏంటి..? దాని ధర ఏంటని ఆరా తీస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ధరించిన ఒక వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన ధరించిన వాచ్ ఖరీదు నాలుగు కోట్ల 75 లక్షలు అంటూ సదరు ట్విట్టర్ యూజర్ పేర్కొనడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. షారుఖ్ తరచుగా వివిధ సందర్భాలలో ఆడెమర్స్ పిగ్యెట్ వాచ్ ధరించి కనిపిస్తూ వస్తున్నాడు.
బ్లూ సిరామిక్ ఏపీ పర్మనెంట్ క్యాలెండర్ వాచ్ని ధరించి ఉన్న తాజా చిత్రాన్ని మంగళవారం షారుక్ ఖాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో షారుఖ్ ధరించిన వాచ్ 4.75 కోట్ల రూపాయలు అని ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ఈ వాచ్ సంవత్సరం ఆగస్టులో విడుదలైంది. ఇక లగ్జరీ వాచెస్ USA అనే వెబ్సైట్ ప్రకారం ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ వాస్తవానికి దాదాపు రూ. 4.9 కోట్లు ($600000)గా ఉంది.
ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచెస్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వాచ్లో చిన్న ముల్లు పెద్ద ముల్లులపై 18 క్యారెట్ల బంగారం తాపడం చేసి ఉంది. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ ఇది సమయాన్ని చూపించడంతో పాటు ఒకవేళ భవిష్యత్తును చెబుతుందా?’ అని ఆశ్చర్యపోతూ కామెంట్ చేశాడు. ఏదేమైనా అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ అమ్మితే ఒక బ్యాచ్ జీవితాలు సెటిలైపోయినట్లు ఈ వాచ్ కూడా అమ్మితే చాలామంది జీవితాలు సెటిలైపోవడం ఖాయం.