Veerasimha Reddy : వీరసింహారెడ్డి గర్జన మామూలుగా లేదుగా.. మొదటి రోజు ఒక్క మల్టీప్లెక్స్ లో 35 షోలు



Veerasimha Reddy : కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న థియేటర్లకు అఖండతో అఖండ ధైర్యాన్నిచ్చాడు బాలయ్య. థియేటర్ లకు రావాలా వద్దా అని భయపడుతున్న ప్రేక్షకులకు క్రేజీ జోష్ వచ్చేలా క్రాక్ తో పిచ్చెక్కించాడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాయే వీరసింహారెడ్డి. సీమ పౌరుషం, తెలుగువారి ఆప్యాత.. చెల్లెలి సెంటిమెంట్ తో.. బాలయ్య ఈ మూవీలో అదరగొట్టాడు. ఇవాళ విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. 

Veerasimha reddy
Veerasimha reddy

వీరసింహారెడ్డి’లో అభిమానులతో ఈలలు వేయించే పవర్‌ఫుల్‌ సంభాషణలను గోపీచంద్‌ మలినేని ఉపయోగించారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, రాయలసీమ సంస్కృతి గురించి సాయిమాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్‌ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తున్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ లా ఉందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా మొదటి రోజు కుమ్మేస్తోంది. విడుదల అన్ని ఏరియాల్లో కూడా సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంటున్నట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

నిన్న విడుదల అయిన తెగింపు సినిమాకు తెలుగు లో పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో.. మరే సినిమా ఏం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద వీర సింహారెడ్డి హవా ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా సాగుతోంది. ప్రతి థియేటర్ లో, మల్టీ ప్లెక్స్ లో వీలైనన్ని ఎక్కువ షోలను వీర సింహారెడ్డికే కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. 
ముఖ్యంగా హైదరాబాద్  కూకట్ పల్లిలోని ఒక  మల్టీప్లెక్స్ లో ఇవాళ అన్ని స్క్రీన్స్ లో అన్ని షో లను వీర సింహారెడ్డి ప్రదర్శిస్తున్నారట.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు షో లు.. ఎర్లీ మార్నింగ్ షో లకు అనుమతులు ఇవ్వడంతో వీర సింహారెడ్డి ఆ ఒక్క మల్టీ ప్లెక్స్ లోనే ఏకంగా 35 షో లు ప్రదర్శిస్తున్నారు. ఆ మల్టీ ప్లెక్స్ లో మొత్తంగా 9 స్క్రీన్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్స్ లో ప్రతి 15 నుండి 20 నిమిషాల గ్యాప్ లో ఒక షో పడే విధంగా మల్టీ ప్లెక్స్ యాజమాన్యం ప్రకటించింది. భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ అయిన నేపథ్యంలో ఈ విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ఒక్క మల్టీ ప్లెక్స్ లో మొదటి రోజు 35 షో లు పడటం రికార్డు గా నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ రికార్డును రేపు విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.