విక్టరీ వెంకటేష్ అసలు పేరు తెలిస్తే షాక్ అవుతారు ?

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన కెరీర్లో తీసిన సినిమాల్లో దాదాపు 70శాతానికి పైగా సినిమాలు హిట్ గా నిలిచాయి. దీంతో అభిమానులు ఆయనకు విక్టరీని బహూకరించారు. విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్ తో సంబంధం లేకుండా యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టేస్తున్నారు వెంకటేశ్​. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నాడు. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇటీవల కాలంలో వెంకటేష్ సోలో హీరోగాకంటే మల్టీస్టారర్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మహేశ్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్ తో F2,F3, నాగచైతన్యతో వెంకీ మామ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాడు. వెంకటేష్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆయన లెజండరీ నిర్మాత, మూవీ మొఘల్ రామానాయుడు చిన్న కొడుకని అందరికీ తెలిసిన విషయమే.

విక్టరీ వెంకటేష్
విక్టరీ వెంకటేష్

వెంకటేష్‌గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. వాస్తవానికి వెంకటేష్ అసలు పేరు అది కాదు. తన నిజం పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. అతడికి తన తాత పేరు పెట్టారు. దగ్గుబాటి ఇంటి వారి ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడు కావడంతో ఆ స్వామి పేరే వెంకటేశ్వర్లుగా రామానాయుడు పెట్టుకున్నారు. అది కాస్తా స్కూల్‌లో కూడా వెంకటేష్ గా మారిపోయింది. అనంతరం సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు వెంకటేశ్వర్లు పేరుతో నటించారు. ఆ పేరుతో నటించిన సినిమాలు అన్ని ఆయనకు విజయాన్ని అందించాయి. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మేన‌కోడ‌లు నీర‌జ‌ను వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు. వెంకటేశ్వర్లు అనే పేరు తనకు చాలా ఇష్టమని వెంకటేష్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here