Game Changer : రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ నుండి డైరెక్టర్ శంకర్ అవుట్.. కొత్త డైరెక్టర్ తో నేటి నుండి షూటింగ్ మొదలు?

- Advertisement -

Game Changer : #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ సమయం లో ఈ సినిమాని ప్రారంభించారో తెలియదు కానీ, అప్పటి నుండి ఈ చిత్రం షూటింగ్ కి అడ్డంకులు ఎదురు అవుతూనే ఉన్నాయి.

Game Changer
Game Changer

ప్రారంభం లో షూటింగ్ శరవేగంగా సాగినప్పటికీ, ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 చిత్రానికి కూడా దర్శకత్వం వహించాల్సిన పరిస్థితి రావడం తో, 15 రోజులు ఇండియన్ 2 మరియు 15 రోజులు ‘గేమ్ చేంజర్’ సినిమాలకు షిఫ్ట్ అవుతూ వచ్చాడు. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి అవ్వడం తో రామ్ చరణ్ కొంతకాలం షూటింగ్స్ కి విరామం ఇచ్చాడు. దీంతో పెండింగ్ లో ఉన్న షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

game-changer-first-look

అయితే ఈ రోజు ఉదయం ఈ సినిమా గురించి వచ్చిన ఒక వార్త అభిమానులను తెగ కంగారు పెట్టేసింది. అదేమిటంటే నేటి నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని, ఈ షెడ్యూల్ లో శంకర్ పాల్గొనబోవడం లేదని, హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలను ఈ షెడ్యూల్ మొత్తానికి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ ఒక వార్త వచ్చింది. ఈ వార్త రాగానే అభిమానులు హడలిపోయారు, ఇంత పెద్ద ప్రతిష్టాత్మక సినిమాకి ఇన్ని అడ్డంకులు ఏంటో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసారు.

- Advertisement -

అయితే ఈ రూమర్స్ బాగా వ్యాప్తి చెందడం తో కాసేపటి క్రితమే శంకర్ సోషల్ మీడియా లో ఓక ఫోటోని అప్లోడ్ చేస్తూ, తాను షూటింగ్ లోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. దీనితో ఉదయం నుండి ప్రచారమైన రూమర్స్ కి చెక్ పడింది, ఇలాంటి రూమర్స్ ని వ్యాప్తి చేసినందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్ గాసిప్పు రాయుళ్ల పై ఫైర్ అయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here