Dil Raju : ఆ సమయంలో సాయి పల్లవిని, నానిని కలపాలని చూసిన దిల్ రాజు

- Advertisement -

Dil Raju : సాయి పల్లవి ఫిదా చిత్రంతో.. ఈ కేరళ కుట్టి స్టార్ డమ్ ఒక్కసారిగా తిరిగిపోయింది. తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సాంప్రదాయాల ఇతివృత్తంలో శేఖర్ కమ్ముల తీసిన ఎక్స్ పర్మెంట్ కు ప్రాణం పోసింది. అందుకే ఇప్పుడు ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చెయ్యకుండా, కథలని ఎంచుకోవడంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. అయితే ఆమెను సినిమాలకి ఒప్పించడం కేవలం దిల్ రాజు కే సాధ్యం అని చెప్పుకుంటున్నారు. ఆయన నిర్మించిన MCA సినిమాలో హీరో నాని సరసన సాయి పల్లవి నటించడానికి కారణం కూడా దిల్ రాజు ప్రయత్నమే అని టాక్. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే ఈ సినిమాలో సాయి పల్లవి చేసిందంటే దానికి కారణం ఆయనే.

dil raju
dil raju

అయితే అప్పట్లో జరిగిన ఓ విషయం తాజాగా బయటకు వచ్చింది. అయితే ఇంత కష్టపడి సాయి పల్లవిని ఒప్పిస్తే ఇప్పుడు లేని చిక్కులు వచ్చినట్టు కనిపిస్తోంది. డిసెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ సినిమా షూటింగ్ అంతా కూల్‌గా జ‌రుగుతోంది అనుకుంటున్న టైంలో హీరో, హీరోయిన్ల మ‌ధ్య చిన్న వివాదం పెద్ద హాట్ టాపిక్‌గా మారిందిట. ఓ సీన్ షూట్ చేస్తోన్న టైంలో హీరో నాని, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య జ‌రిగిన చిన్న వివాదం కాస్త పెద్ద‌ద‌య్యి హీరో నాని షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయే వ‌ర‌కు వ‌చ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీలో టాక్ విన‌ప‌డుతోంది.

Nani

ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినా, ఎందుకు జరిగింది? అన్న విషయంలో మాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు. సినిమాలో డైలాగులకు సంబంధించి నాని సాయి పల్లవికి ఏదో సలహా ఇవ్వబోయాడట! దాంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందట. ఇదంతా పాత సంగతే అయితే బయటకి మాత్రం కాస్త ఆలస్యంగా తెలిసింది.

- Advertisement -
సాయి పల్లవి

దిల్ రాజు ఈ ఇద్దరినీ కలపాలని చూసినా ఇద్దరూ కలవకుండా షూటింగ్‌ ఏదోలా పూర్తి చేసేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వెళ్ళిపోతున్నారట. ఇలా అయితే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకూడా దెబ్బతింటుందని యూనిత్ సభ్యులు ఆందోళన పడ్డారట. కానీ, ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచి కోట్లు వసూళ్లు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here