సినిమాల్లోకి రాకముందు Nidhhi Agerwal అలాంటి పనులు చేసేదా..! పూర్తి స్టోరీ చూస్తే ఆశ్చర్యపోతారుNidhhi Agerwal చేసిన అతి కొద్ది సినిమాలతోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి , ఆ తర్వాత బెంగళూరు లో తన విద్యాబ్యాసం ని పూర్తి చేసింది.కేవలం హిందీ మాత్రమే తెలిసిన మార్వారీ కుటుంబం జన్మించిన ఈమెకి తెలుగు, తమిళ్ మరియు కన్నడ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలడు.ఈమెది చిన్నప్పటి నుండి చాలా రిచ్ ఫ్యామిలీ, ఈమె తండ్రి రాజేష్ అగర్వాల్ కి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

నిధి అగర్వాల్ కేవలం తన తండ్రి వ్యాపారాలను చూసుకునేందుకు కోసం బిజినెస్ మ్యానేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ ని కూడా పూర్తి చేసింది.సినిమాల్లోకి రాకముందు ఈమె తన తండ్రి వ్యాపారాలన్నీ చూసుకునేది, కానీ చిన్నప్పటి నుండి సినిమాల మీద మక్కువ ఉన్న నిధి అగర్వాల్ 2016 వ సంవత్సరం లో షబ్బీర్ ఖాన్ అనే దర్శకుడు టైగర్ ష్రాఫ్ తో తియ్యబోతున్న మున్నా మైఖేల్ అనే సినిమా కి కొత్త హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తుంటే సెలెక్ట్ అవుతానో లేదో చూద్దాం అంటూ ఆడిషన్స్ కి తన ఫోటోలను పంపింది.

Nidhhi

లక్కీ గా ఆమెకి షబ్బీర్ ఖాన్ నుండి ఆడిషన్స్ లో పాల్గొనాల్సిందిగా పిలుపు వచ్చింది,ఆరోజు ఆడిషన్స్ లో ఆమెతో పాటుగా సుమారు 300 మంది పాల్గొన్నారు,అంత మందిలో ఈమె సెలెక్ట్ అయ్యింది.ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ, నిధి అగర్వాల్ కి అవకాశాలు బాగానే తెచ్చిపెట్టింది.ఇక కొంతకాలం వ్యాపార రంగాన్ని పక్కన పెట్టి సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది.తెలుగులో ఈమె నటించిన మొట్టమొదటి చిత్రం నాగ చైతన్య హీరో గా నటించిన ‘సవ్యసాచి’ అనే చిత్రం.ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది, కానీ నిధి అగర్వాల్ మాత్రం ప్రేక్షకుల దృష్టిలో బాగా పడింది.

Agerwal

నిర్మాతలు కూడా అది గమనించి , మొదటి సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఆమెని హీరోయిన్ గా తమ సినిమాల్లో తీసుకునేందుకు క్యూ కట్టేసారు.అలా ఆ సినిమా తర్వాత ఈమె తెలుగు మరియు తమిళం బాషలలో కలిపి సుమారుగా ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.వాటిల్లో ‘ఇస్మార్ట్ శంకర్‘ అనే చిత్రం తప్ప మిగిలినవన్నీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి.ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మరియు ప్రభాస్ తో ‘రాజా డీలక్స్’ అనే సినిమాలు చేస్తుంది.ఈ రెండు చిత్రాలు విడుదలై సక్సెస్ సాధిస్తే నిధి అగర్వాల్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపొయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.