Nidhhi Agerwal : నిధి అగర్వాల్ ఇంట వేణు స్వామి పూజలు.. ఎందుకోసమో తెలుసా.?

- Advertisement -

Nidhhi Agerwal : హైదరాబాది అందం.. తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ బ్యూటీ.. అంతకుముందు ఎన్ని సినిమాలలో నటించినా కానీ అనుకున్న స్థాయిలో ఫేమ్ రాలేదు.. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి పూజలు చేస్తున్న నిధి అగర్వాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దాంతో నిధిపై రకరకాల కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి..

Nidhhi Agerwal
Nidhhi Agerwal

జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగచైతన్య, సమంత ముందే విడాకులు తీసుకుంటారు అని చెప్పి సంచలనంగా మారాడు. ఆ తరువాత సినీ సెలబ్రిటీల గురించి తరచూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. గతంలో వేణు స్వామి చేత రష్మిక మందన పూజలు చేయించింది. ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా మారింది.

తాజాగా ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి తన ఇంట్లో.. రాజశ్యామల పూజ, రాహు కేతు దోష నివారణ పూజలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నేటిజన్స్ మాత్రం ఆమెకు సినిమా అవకాశాల కోసమే ఈ పూజలు చేసిందని.. ఇండస్ట్రీలో మరింతగా నిలదొక్కుకోవడం కోసం తన జాతకంలోని దోషాలకు నివారణ చేయించుకోవడం కోసం ఈ పూజలు నిర్వహించిందని అనుకుంటున్నారు.

- Advertisement -

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. హరిహర వీరముల్లు సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడు గ్రాఫ్ మారిపోవడం కోసం ముందు నుంచి పూజలు చేస్తోందని మరికొంతమంది అనుకుంటున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడా ఈ అమ్మడికి ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. నిధి అగర్వాల్ కి తమిళ అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here