‘దేవర’ ఊచకోతకు రికార్డ్స్ మొత్తం స్మాష్..సెన్సేషన్ సృష్టిస్తున్న ఫస్ట్ లుక్

- Advertisement -

RRR తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ , ఆ చిత్రం తర్వాత కొరటాల శివ తో ఒక చిత్రం ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుమారుగా నెల రోజుల పాటు సాగిన ఈ మొదటి షెడ్యూల్ లో ఇంటర్వెల్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే ఎన్టీఆర్ పరిచయానికి చెందిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ సినిమాకి టైటిల్ గా ‘దేవర’ అని ఫిక్స్ చేసారు. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు .ట్విట్టర్ లో స్వయంగా ఎన్టీఆర్ ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యగా దానికి నిమిషాల వ్యవధి లోనే వేలకొద్దీ లైక్స్ మరియు రీట్వీట్స్ వచ్చాయి.

నల్ల చొక్కా మరియు నల్ల లుంగీ వేసుకొనే చేతిలో లో ఒక పెద్ద కత్తి పెట్టుకొని నిల్చున్న ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ ని చూసి ఇప్పటి నుండే బాక్స్ ఆఫీస్ లెక్కలు వెయ్యడం ప్రారంభించారు ఫ్యాన్స్. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పెద్ద ఎన్టీఆర్ కి సంబంధించిన లుక్ ని నేడు విడుదల చేసారు.

- Advertisement -

ఎన్టీఆర్ ఒక ఊర మాస్ స్టోరీ చేసి చాలా కాలమే అయ్యింది. ఫ్యాన్స్ కూడా అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఫ్యాన్స్ కోరుకున్న విధంగా ఉండబోతోందట. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నదిస్తుండగా , జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక హీరో శ్రీకాంత్ జాన్వీ కపూర్ తండ్రిగా నటిస్తున్నాడు.

దేవర
దేవర
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here