త్వరలోనే పవిత్రతో పెళ్లి.. ప్రెస్ మీట్లో చెప్పిన నరేష్

- Advertisement -

గత కొంతకాలంగా నరేష్, పవిత్ర లోకేష్ కి సంబంధించిన ప్రతి విషయం సెన్సేషనల్ న్యూస్ గా మారుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ జంట ట్రెండింగ్ గా మారారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరాలు క్లిక్ మనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఈ జంట రిలేషన్ లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు పుట్టుకువచ్చాయి. కానీ అదంతా సినిమా కోసం అంటూ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా నరేష్, పవిత్ర కలిసి నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నటుడు నరేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవిత్రా లోకేశ్‌ మధ్య బంధంపై నరేశ్‌ స్పష్టతనిచ్చారు. అంతేకాదు, తమ పెళ్లిపైనా అభిప్రాయాన్ని పంచుకున్నారు.

నరేష్
నరేష్

‘‘పవిత్రా లోకేశ్‌ను వివాహం చేసుకుంటారా?’ అని ఈ మధ్య విలేకరులు అడుగుతున్నారు. ‘అసలు వివాహం అంటే ఏంటి?’ తాళికట్టడం, ఉంగరం ధరించడం వివాహమా? ఇవన్నీ మన మత, సంప్రదాయల కోసం పెట్టుకున్న గుర్తులు. వివాహం అంటే రెండు హృదయాలు కలవడం. మా మనసులు ఎప్పుడో కలిశాయి. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఈ విషయాన్నే నేను స్పష్టం చేయాలనుకున్నా. అదే సమయంలో వివాహ వ్యవస్థ అంటే మాకెంతో గౌరవం. ప్రపంచం మారుతోంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్‌. అందరూ మా సినిమా చూడండి. ఆ తర్వాత కూడా మిమ్మల్ని కలుస్తాం. మీకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెబుతాం’’ అని నరేశ్‌ అన్నారు.

నటుడు నరేష్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న మూవీ ‘మళ్లీ పెళ్లి’. అయితే ఇది తన బయోగ్రఫీ కాదని అంటున్నారు నరేష్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ జోరుగా సాగుతుంది. ప్రమోషన్ లో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో నరేష్, పవిత్ర లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. తమ పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. భూమి బద్దలైనా.. ఆకాశం విరిగిపడినా.. మేం ఇద్దరం కలిసే ఉంటాం. మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి.. మనసులు కలిశాయి.. అందుకే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. అందరి ఆశీర్వాదంతో త్వరలో పవిత్రను పెళ్లి చేసుకుంటా అన్నారు నరేష్. ఉన్నంతకాలం సంతోషంగా బతకాలి. సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా ‘మళ్లీ పెళ్లి’ టీజర్‌, ట్రైలర్‌కు చాలా మంది కనెక్ట్‌ అయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here