ఎన్టీఆర్ ను గెలికిన విశ్వక్ సేన్.. ఫ్యాన్ అంటూనే సెటైర్స్.. ఫ్యాన్స్ ఫైర్..

- Advertisement -

మాస్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్య వివాదాల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. సినిమాలకన్నా ఎక్కువగా గలీజ్ మాటలు మాట్లాడుతూ తనపై జనాల్లో క్రేజ్ ను తీసుకొస్తున్నాడు.. ఇటీవల సినిమా హిట్ అవ్వడం కోసం పెద్ద రచ్చ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ వేయించుకున్నాడు.. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరోసారి స్టార్ హీరో ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యాడు. గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ను గెలికాడు.. ఫ్యాన్ అంటూనే సెటైర్స్ వేసాడు.. ఆ విషయం పై ఇటు నందమూరి ఫ్యాన్స్.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు.. అసలు విషయానికొస్తే..

విశ్వక్ సేన్
విశ్వక్ సేన్

20 సంవత్సరాల క్రితం విడుదలైన ఎన్టీఆర్ ‘సింహాద్రి’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ నీ పూర్తిగా మాస్ ప్రేక్షకుల వద్దకు చేర్చడం జరిగింది.. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ స్టార్ హీరోలకు సంబంధించి బ్లాక్ బస్టర్ హిట్స్ మళ్లీ విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ సింహాద్రి మే 20వ తారీకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్ లపై ప్రదర్శించబోతున్నారు.. ఈ మేరకు ఈ సినిమా రిరిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు..

హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు యంగ్ హీరో విశ్వక్ తో పాటు దర్శకులు హను రాగవపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ యెర్నేని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ… దేశమంతా.. సింహాద్రి రీ రిలీజ్ గురించి చర్చించుకుంటుంది. ఇదొక నేషనల్ న్యూస్. ఎన్టీఆర్ అభిమానిగా గర్వపడుతున్న. నాకు తెలిసినంతవరకు ఏ అభిమానికి ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు.

- Advertisement -

లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుక అనంతరం మరో రెండు రోజులు ఉండమని అక్కడివారు ఎన్టీఆర్ ని కోరిక… హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి హాజరుకావాలని అన్నారట. ఈ విషయం నాకు ఒకరి చెబితే తెలిసింది. ఆ రకంగా అభిమానులకు ఎన్టీఆర్ గౌరవం ఇస్తారు. నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ టైంలో రావటం నిజంగా నేను మర్చిపోలేనిది ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను… ఎన్టీఆర్ కు ఫ్యాన్ కానీ అన్న రాలేదు.. సినిమాకోసం నేను ఏదైనా చేస్తాను అంటూ విశ్వక్ సేన్ సంచలన స్పీచ్ ఇచ్చారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here