Ntr Devara కొత్త లుక్‌ని దేవర మేకర్స్ రివీల్ చేశారు. అప్‌డేట్‌ను ఎన్టీఆర్ ఫోటోతో సహా వెల్లడించారు. దేవర షూటింగ్ గోవాలో జరగనుందని యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను గోవాలో చిత్రీకరించనున్నారు. ఇక్కడ ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై ఈ పాటను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌తో పాటు ఎన్టీఆర్ లుక్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ నడుముపై చేతులు వేసుకుని భీకరంగా కనిపిస్తున్నాడు. మెడలో రుద్రాక్షతో ఎన్టీఆర్ మాస్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఉన్నారు. గోవాలో షూట్ చేయనున్న ఈ పాటకు రాజు సుందరం చక్కని కొరియోగ్రఫీ అందించబోతున్నట్లు ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది.
దేవర సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌కి ధీటుగా దేవరలో సైఫ్ అలీఖాన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతోందని అంటున్నారు. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ గాయపడడం, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా విడుదల వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం దేవర. కోస్తాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కొరటాల శివ స్థాయిలో ఎన్టీఆర్ హీరోయిజం ఆవిష్కృతం కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
దేవర పార్ట్ వన్ బడ్జెట్ మూడు వందల కోట్లు అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దేవర చిత్రాన్ని హరి కొసరాజు, సుధాకర్ మిక్కిలినేనితో కలిసి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమా దేవర. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
దేవర షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమా OTT హక్కులు అమ్ముడయ్యాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కులు దాదాపు 80 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. దేవర సినిమాలో శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జాన్వీకపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. దేవర తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. రామ్‌చరణ్, జాన్వీకపూర్ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది.