Devara : ‘దేవర’ మూవీ స్టోరీ నచ్చక ముఖ్యమైన పాత్రని మిస్ చేసుకున్న విశ్వక్ సేన్?

- Advertisement -

Devara : జూనియర్ ఎన్టీఆర్ కి సెలబ్రిటీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న సెలబ్రిటీస్ లో ఎవరి యాక్టింగ్ మీకు బాగా నచ్చుతుంది అని అడిగితే ఎక్కువ శాతం మంది జాకిర్ ఎన్టీఆర్ పేరే చెప్తారు. నటన పరంగా ఆయన జనాల్లో సంపాదించుకున్న పేరు అలాంటిది. అలాగే యువ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానిని అంటూ చెప్పుకొని తిరిగే వ్యక్తి విశ్వక్ సేన్.

ఈయన అనేక ఇంటర్వ్యూస్ లో తనకి బాగా ఇష్టమైన హీరో జూనియర్ నే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తాను నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన చిత్రం ‘ధమ్కీ’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా పిలిచి ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, బాలయ్య బాబు అంటే కూడా విశ్వక్ సేన్ కి బాగా ఇష్టం.

అలాంటి విశ్వక్ సేన్ తనకి ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ వచ్చినప్పుడు కథ నచ్చలేదని రిజెక్ట్ చేసాడట. ఇది స్వయంగా ఆయన మాటల్లో నుండే వచ్చింది. ఆయన మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఒక పెద్ద హీరో సినిమాలో, నాకు బాగా ఇష్టమైన హీరో సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసే అవకాశం వచ్చింది. అంటే ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో రవితేజ క్యారక్టర్ ఎలాగో, అలా నా క్యారక్టర్ ఆ సినిమాలో ఉంటుంది. కానీ ఎందుకో నాకు చెయ్యాలని అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఎందుకు చెయ్యాలని అనిపించలేదు అని యాంకర్ అడగగా ‘నాకు అదే హీరోతో ఇంకా మంచి సినిమా చెయ్యాలని ఉంది. ఆ స్టోరీ నాకు నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. తనకి బాగా ఇష్టమైన హీరో సినిమా అంటే కచ్చితంగా అది ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం అయ్యుండాలి, లేకపోతే బాలకృష్ణ – బాబీ సినిమా అయ్యుండాలి. బాలకృష్ణ సినిమానే అయ్యుంటుంది, ఎందుకంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడు, ఆ పాత్రనే విశ్వక్ సేన్ వదిలి ఉంటాడు అని కూడా అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here