Chiranjeevi :రోజాకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్.. అడ్డదారిలో అది కావాలంటే అలాగే చేస్తుంటారంటూ కామెంట్స్Chiranjeevi : సంక్రాంతి సందడి షురూ అయింది. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఓవైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నందమూరి బాలకృష్ణ రెడీ అయ్యారు. వీరసింహారెడ్డితో బాలయ్య రేపు థియేటర్ కు వస్తుండగా.. వాల్తేరు వీరయ్యతో చిరు ఎల్లుండి సందడి చేయనున్నారు. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోస్ తమతమ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. 

Chiranjeevi Waltair Veerayya
Chiranjeevi Waltair Veerayya

వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి రంగంలోకి దిగారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్పారు. అంతేకాకుండా చిరు ఈ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చిరు ఎవరిపై కామెంట్స్ చేశారంటే..?

Roja and CHiranjeevi

సినిమా పరిశ్రమలో సేవా కార్యక్రమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. గతంలో కోవిడ్ సమయంలో కూడా చిరు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అంతే కాదు ఒకప్పుడు సినిమా రంగంలో వెలుగులీని ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న చాలా మంది సీనియర్ నటీనటులకు చిరు సాయం చేస్తుంటారు.

అయితే  ఇటీవల ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ సినిమాల్లో ప్రజల డబ్బుతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. కానీ ప్రజలకు చిన్న సాయం కూడా చేయలేదు. అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో రోజాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. తాజాగా చిరంజీవి రోజా వ్యాఖ్యలపై ఇంటర్వ్యూలో పరోక్షంగా స్పందించారు. 

చిరంజీవి మాట్లాడుతూ.. “నన్ను తిడితేనే వాళ్లకు గుర్తింపు లభిస్తుంది. అడ్డ దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. నా పేరు వాడకపోతే వాళ్లకు గుర్తింపు ఉండదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాతో స్నేహంగా ఉన్నవారే ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. నేను ఎవ్వరికి సాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు.

నా గురించి వీళ్లకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నన్ను తిట్టినా పర్వాలేదు.. నాకు ప్రశాంతతే ముఖ్యం. అందుకే నేను తిరిగి మాట్లాడను. నా నుంచి ప్రశాంతతని ఎవరూ దూరం చేయలేరు” అంటూ చిరు రోజాకి పరోక్షంగా చురకలు అంటించారు.

రోజా మంత్రి పదవి పొందాక చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ ధరల సమస్య ఏర్పడినప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. అప్పుడు చిరుని అంతా ప్రశంసించారు. అయితే ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. చివరి నిమిషం వరకు వేదిక మార్పులు చేస్తూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

దాని గురించి కూడా చిరు స్పందించారు. అలాంటి సందర్భాల్లో కోపం రాదా అని ప్రశ్నించగా.. ‘నేను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే దానివల్ల ఇతరులకు సమస్యగా మారుతుంది. అందుకే చాలా సందర్భాల్లో కోపం దరిచేరనీయను’ అని చిరు అన్నారు.