Vishnu Prasad : చిరంజీవి పెద్ద అల్లుడు ఏం బిజినెస్ లు చేస్తాడో తెలుసా?

- Advertisement -

Vishnu Prasad : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టం తో పైకి వచ్చిన వారిలో హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు మొదటగా వినిపిస్తోంది. చిరు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యాయి.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.. ఈయన సినిమా లతో పాటు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సాయం అడిగిన వారికి కాదనకుండా సాయం అందిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఇటీవల కరోనా పరిస్థితులు అందుకు ఉదాహరణ.. కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడం. ఎన్నో వందల కుటుంబాలను రోడ్డున పడకుండా ఆసరాగా నిలిచారు మెగాస్టార్.

రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు.ఇక చిరంజీవి ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాతో అభిమానులను పలకరించాడు. ఇక ఈ సినిమా మొదట హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత కలెక్షన్లు తగ్గాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి తన పెద్దకూతురు సుస్మితను చెన్నైలో టాప్ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశారు. చెన్నై లో సుస్మిత అత్తింటి వాళ్ళు మంచి పేరున్న బిజినెస్మేన్ కుటుంబం. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ తాతగారు L.V రామారావు అంటే అప్పట్లో చెన్నైలోనే టాప్ బిజినెస్ మాన్. కేవలం చెన్నైలోనే కాకుండా అమెరికా, జపాన్, థాయిలాండ్, సింగపూర్ వంటి విదేశాలలో కూడా వీళ్లకు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి..

- Advertisement -
Sushmita Vishnu Prasad
Sushmita Vishnu Prasad

సుస్మిత వాళ్ళ అత్తగారిది రాయలసీమ అయినప్పటికీ వ్యాపార రీత్యా తమిళనాడు కి వెళ్లి అక్కడే చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇక సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ విదేశాల్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేసి చదువు పూర్తయ్యాక వాళ్ల తండ్రి బిజినెస్ లు చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక ఆయన తాతయ్య స్టార్ట్ చేసిన పామాయిల్ బిజినెస్ విష్ణు ప్రసాద్ తండ్రి చేతిలోకి వచ్చాక బాగా డెవలప్ అయింది.

ఇక ఆ బిజినెస్ ని విష్ణుప్రసాద్ మొదలెట్టాక ఆ బిజినెస్ రెట్టింపు అయింది.వీళ్ళ ఫ్యామిలీ నే ప్రపంచంలోని చాలా దేశాలకు మేలు రకం పామాయిల్ ని ఎగుమతి చేస్తుంది. ఇక వీళ్లకు ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు సమాచారం. సుస్మిత విష్ణు ప్రసాద్ కి ఇద్దరూ కూతుర్లు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో సుస్మిత సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి రామ్ చరణ్ కి, చిరంజీవికి డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న ఆసక్తి చూసి సుస్మిత భర్త ఆమెను సపోర్ట్ చేశారు..ఇప్పుడు ఈమె కూడా రెండు చేతులా సంపాదిస్తూ వస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here