Anchor Ravi : యాంకర్ రవి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణమేంటో తెలుసా?

- Advertisement -

Anchor Ravi : యాంకర్ రవి పేరు తెలియని వాళ్ళు ఉండరు.. బుల్లితెరపై కనిపించే మేల్ యాంకర్ లలో ఒకరు..ఈయనకు ఒక ప్రత్యేక స్థానం వుంది.అందుకు కారణాలు కూడా లేకపోలేదు..ఆయన చేసే ఓవరాక్షన్ మిగతా యాంకర్లు ఎవ్వరు చేయరు అనే టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. యాంకర్ రవిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే జనాలు ఎంతమంది ఉన్నా సరే ఆయనను అభిమానించే ఫ్యాన్స్ బోలెడు మంది ఉన్నారు .

ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన సొంత టాలెంట్ తో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఎదగడం అంటే మాటలు కాదు. కచ్చితంగా మనలో కాస్తో కూస్తో టాలెంట్ ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి ..ఆ రెండు ఉన్న యాంకర్ రవి ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది టైంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు .

- Advertisement -

అయితే ఇండస్ట్రీలో ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కూడా ఉంటుంది . ఎక్కడ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో అక్కడ నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. యాంకర్ రవిని పొగిడే జనాలు ఉన్నచోటే యాంకర్ రవిని తిట్టే జనాలు ఉన్నారు. ఆయన ఏ యాంకర్ తో చేస్తే ఆ యాంకర్ ని గోకుతూ ఉంటాడని ఇప్పటికే లాస్యను చాలా టార్చర్ పెట్టాడని.. ఆమె తర్వాత బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖిని సైతం తన వల్గర్ బిహేవియర్ తో టార్చర్ చేశారని ..గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవంతా ఫేక్ వార్తలు అంటూ కొట్టి పడేశారు అతని ఫ్యాన్స్ .

Anchor Ravi
Anchor Ravi

కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత యాంకర్ రవి బయట పెద్దగా చెప్పుకునే రేంజ్ లో కనిపించట్లేదు. షోస్ చేస్తున్నారే కానీ అవి బాగా పాపులారిటీ తెచ్చుకునే రేంజ్ లో అయితే లేవు . దీనికి కారణం ఏంటా అని జనాలు చర్చించుకుంటున్నారు . అయితే బిగ్ బాస్ తర్వాత యాంకర్ రవి ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ పై కాన్సన్ట్రేషన్ చేశారని ..ఈ క్రమంలోనే తన భార్య నిత్య , యాంకర్ రవి పూర్తి ఫోకస్ యూట్యూబ్ ఛానల్ పైన పెట్టారని తెలుస్తుంది.

ఈ మేరకు కొందరు రవి హెట్టర్స్ మాత్రం లాస్యని, శ్రీముఖిని ఏడిపించుకున్న ఉసురే తగిలిందని ఆ కారణంగానే ఆయనే బుల్లితెరపై స్టార్ గా మారలేకపోతున్నారని చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే తప్పు అనేది ఎప్పుడు ఒకరి సైడే ఉండదు ..రవి తప్పు చేస్తే కాస్తో కూస్తో వాళ్ళు తప్పు చేసిన వాళ్లై ఉంటారు అంటూ రవి ఫ్యాన్స్ రవికి సపోర్టుగా నిలుస్తున్నారు..మరి యాంకర్ రవి ఈ వార్తల పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here