Chiranjeevi : హే ఆపవయ్యా మీ నాన్న సుత్తి.. చిరంజీవి ఇండైరెక్ట్ కౌంటర్ బాలకృష్ణకేగా..?Chiranjeevi : ఆరోజుల్లో మా నాన్న గారు.. ఈ డైలాగ్ తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. ”ఆ రోజుల్లో మా నాన్నగారూ..” అనేది బాలయ్య బాబు ఊతపదం. అలా ఎవరైనా అంటే వెంటనే బాలయ్య గుర్తొస్తారు. ఇక బాలకృష్ణ ప్రతి వేదికపై తండ్రి నందమూరి తారకరామారావు ప్రస్తావన తెస్తారు. మాకంటే ఎవరూ గొప్ప కాదంటారు.

Chiranjeevi
chiranjeevi

అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు. అయితే డైరెక్ట్ బాలయ్యను అటాక్ చేసి కాదు. కాస్త ఇండైరెక్ట్ గానే బాలకృష్ణకు చురకలంటించినట్లు అనిపించింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి ప్రత్యేకంగా కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ పరోక్షంగా బాలయ్య గురించి చెప్పినట్లు ఉన్నాయి.

Balakrishna

రామ్ చరణ్ ప్రతిసారి, ప్రతి చోట నా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. మా నాన్న చిరంజీవి, ఆయన చాలా గొప్పోడు అంటూ ప్రతిసారి చెబుతుంటే… జనాలకు విసుగొచ్చేస్తుంది. హే ఆపవయ్యా నీ సుత్తి అని చరణ్ ని తిడతారని చిరంజీవి కామెంట్ చేశారు. చిరంజీవి అక్కడ ఉదహరించిన తీరు చూస్తే బాలయ్యని ఉద్దేశించే అన్నట్లు ఉంది. 

వాల్తేరు వీరయ్య ప్రీరీలీజ్ ఈవెంట్లో సైతం చిరంజీవి బాలయ్యను టార్గెట్ చేశారు. శ్రుతి హాసన్ ఈవెంట్ కి అనారోగ్య కారణాలు చూపుతూ హాజరు కాలేదు. ఆమె ప్రస్తావన తెస్తూ.. ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు. సడన్ గా శ్రుతి ఆరోగ్యం బాగోలేదంట. బహుశా ఆమెను ఎవరైనా బెదిరించారేమో… అని నవ్వుతూ సెటైర్స్ వేశారు. అసలు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకాకుండా శ్రుతి హాసన్ ని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. వీరసింహారెడ్డి చిత్రానికి పోటీగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి రాకుండా  శ్రుతిని బాలయ్య బెదిరించాడన్నట్లు ఆయన ఆరోపణ ఉంది. 

ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..  “అభిమానులు ఏం కోరుకుంటారో దానిని ఇవ్వడానికి నేను తపన పడుతుంటాను. వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. ఈ సినిమాలో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ముఠా మేస్త్రీ’ల్లో చిరంజీవి ఎలా ఉన్నాడో ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అలా ఉంటాడు. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. నా కాస్టూమ్స్‌ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు ఇంత మాస్‌గా కనిపించలేదు.” అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

Tags: