Veera Simha Reddy : ప్రముఖ ఓటీటీ లో విడుదలకు రెడీ అవుతున్న వీరసింహారెడ్డి..



Veera Simha Reddy : నందమూరి లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి ఈరోజు విడుదల అయింది..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన అంటే ఈరోజు సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది..సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేశాయి..

Veera Simha Reddy
Veera Simha Reddy

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దునియా విలన్ పాత్ర పోషించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించారు. సిస్టర్ సెంటిమెంటుతో వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే మంచి సక్సెస్ టాక్ అందుకుంది. ఇదిలా ఉండగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో సందడి చేసిన తర్వాత కచ్చితంగా ఓటీటీ లోకి వస్తూ ఉంటుంది. అందుకే థియేటర్లలో సినిమా చూడడం మిస్సయిన వారు ఓటీటీ ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు..ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వీరసింహారెడ్డి త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎనిమిది వారాల తర్వాతనే సినిమా ఓటీటీ లో వచ్చే అవకాశం ఉంది.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

అయితే ఎవరు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నారు అనే విషయాన్నికొస్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం..గతంలో అఖండ సినిమాను కూడా వీరే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ సినిమా భారీ హిట్ సాధించడంతోపాటు కలెక్షన్ల పరంగా భారీ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి ఓటీటీ రైట్స్ కూడా సొంతం చేసుకుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్..మొత్తానికి బాలయ్యా సంక్రాంతికి జాతరను చూపించారు..మంచి టాక్ తో దూసుకుపోతుంది..

Tags: