Shruti Haasan : ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో శ్రుతి హాసన్ ఫైట్ సీక్వెన్స్.. సినిమాకే హైలైట్ ​అట..!

- Advertisement -

Shruti Haasan : శ్రుతి హాసన్​.. ప్రజెంట్ టాలీవుడ్​లో సూపర్ బిజీగా ఉన్న హీరోయిన్​. ఓవైపు చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ..మరోవైపు ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్​తో ఆడిపాడుతోంది. ఈ బ్యూటీ సంక్రాంతి బరిలో రెండు సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ రెండు మూవీస్ కూడా టాలీవుడ్ స్టార్ హీరోస్​వే.

Shruti Haasan
Shruti Haasan

ఈ ఏడాది శ్రుతి హాసన్ లక్ మామూలుగా లేదు. సూపర్ హిట్ సినిమాల్లో ఈ భామ ఛాన్స్ కొట్టేసింది. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డిలో ఈ భామ ఆడిపాడింది. ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నాయి. సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది శ్రుతి హాసన్. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్​కు సంబంధించి బిజీగా ఉంది. అయితే అనారోగ్యం కారణంగా కొన్నిసార్లు ప్రమోషన్స్​కు డుమ్మా కొడుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్​కు దగ్గరగానే ఉంటోంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ క్రేజీ న్యూస్ చెప్పింది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఈ బ్యూటీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. అది కూడా మెగాస్టార్ చిరంజీవితోనట. మరి ఈ మూవీ గురించి.. వీరసింహారెడ్డి చిత్రం గురించి శ్రుతి మరికొన్ని ముచ్చట్లు చెప్పింది. అవేంటో ఓసారి చూసేద్దామా..?

walthair veeraya
walthair veeraya

వీరసింహారెడ్డి’లో నా పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. ‘బలుపు’ చిత్రంలోని నా శ్రుతి పాత్రలో కనిపించే ఎనర్జీ ఇందులోనూ కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని చాలా నవ్విస్తుంది.  ‘వాల్తేరు వీరయ్య’లో నా పాత్ర ఫన్నీగా ఉంటుంది. అదే సమయంలో కాస్త యాక్షన్‌ టచ్‌ కూడా ఉంటుంది. సినిమాలో నాకు చిరంజీవికి మధ్య చిన్న ఫన్నీ ఫైట్‌ ఉంటుంది. దాన్ని రామ్‌ – లక్ష్మణ్‌ కొరియోగ్రాఫ్‌ చేశారు. ఈ రెండు చిత్రాలు వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. కథ కథనాలు చాలా కొత్తగా.. ఆకట్టుకునేలా ఉంటాయి’’. అని శ్రుతి హాసన్ అసలు సంగతి చెప్పింది.

- Advertisement -

‘‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు రెండూ ఒకేసారి వస్తాయని అసలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇలా జరగడం ఇది రెండో సారి. గతంలోనూ ఓ పండక్కి ఇలాగే నా రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి మాత్రం చాలా ప్రత్యేకం. చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు లెజెండ్‌ హీరోలతో కలిసి ఒకేసారి రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు ఒత్తిడి ఏం లేదు. కాకపోతే రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నప్పుడు ఒత్తిడిగానే అనిపించేది. నా ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా వచ్చాయి? సంభాషణలు సరిగ్గా చెప్పానా? హవభావాలు సరిగ్గా పలికాయా లేదా? అని ఆలోచిస్తుండేదాన్ని. నా పని పూర్తయ్యాక మాత్రం ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంది’’ అని శ్రుతి చెప్పుకొచ్చింది.

‘‘చిరు, బాలయ్యలతో కలిసి డ్యాన్స్‌ చేయడం చాలా బాగుంది. ఈ రెండు సినిమాలకీ శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ‘‘సుగుణ సుందరి’’ పాటలోని స్టెప్స్‌ చాలా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలాగే ‘‘శ్రీదేవి – చిరంజీవి’’ పాటలోనూ భిన్నమైన గ్రేస్‌ ఉన్న స్టెప్స్‌ చేశాం. ఆ పాటకీ చక్కటి ఆదరణ లభిస్తోంది. దీన్ని మేము యూరోప్‌లో మైనస్‌ 11డిగ్రీల చలిలో షూట్‌ చేశాం. ఆ చలిని తట్టుకోవాలంటే ఓ కోట్‌ సరిపోదు. నాలుగైదు కోట్స్‌ ధరించాలి. అంత గడ్డకట్టించే చలిలో ఓ పలుచటి చీర కట్టుకొని స్టెప్పేయడం చాలా సవాల్‌గా అనిపించింది’’. అని శ్రుతి చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here