Bollywood Actress : బాప్ రే.. బాలీవుడ్ స్టార్ కిడ్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

- Advertisement -

Bollywood Actress : సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే.. ఇప్పుడు బాలీవుడ్ లో హవా అంతా ఈ స్టార్ కిడ్స్ దే. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని ఈ బ్యూటీస్ కు బీ టౌన్ లో ఉన్న క్రేజ్ చూస్తే దిమ్మతిరిగాల్సిందే. సినిమా తెరపై అరంగేట్రం చేసి కనీసం రెండు మూడేళ్లు కూడా కాలేదు.. అప్పుడే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరికొన్ని కోట్లు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇక ఈ బ్యూటీస్ స్క్రిప్టుల సెలక్షన్ కూడా భలే గమ్మత్తుగా ఉంటోంది. అందరిలా మూస ధోరణిలో సాగకుండా ఈ స్టార్ కిడ్స్ తమ రూటే సపరేటు అంటూ డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ఒక సినిమా హిట్ అయిందంటే చాలు రెమ్యునరేషన్ డబుల్ డిమాండ్ చేస్తున్నారు.

Bollywood Actress
Bollywood Actress

బీ టౌన్ స్టార్ కిడ్స్ సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండేల గురించే. ఈ బ్యూటీస్ కు ఇప్పటికే తమిళ, తెలుగు ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వరుస కట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీస్ ఒక సినిమాకు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ చూస్తే దిమ్మతిరిగి బొమ్మ పడాల్సిందే.

Jahnvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ `ధడక్` సినిమాతో తెరపైకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ ఫిల్మ్ ఛాయిస్ లు చూసి పొరుగు ఇండస్ట్రీలు కూడా మనసు పడుతున్నాయి. త్వరలోనే ఈ భామ పాన్ ఇండియా స్టార్ సరసన టాలీవుడ్ అరంగేట్రం చేస్తుందని టాక్. జాన్వీ ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి రూ.6 కోట్లు పారితోషికంగా అందుకుంటోందట. బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల కోసం రూ. 50 నుంచి రూ.60 లక్షలు తీసుకుంటుందోట. జాన్వీ నికర సంపాదన విలువ దాదాపు 66 కోట్లు ఉంటుందని అంచనా.

- Advertisement -
Ananya Pandey

విజయ్ దేవరకొండ లైగర్ తో టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన అనన్య పాండే బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 మూవీతో కరణ్ జోహర్ ప్రాడక్ట్ గా బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ.4 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. పాండే నికర సంపదల విలువ రూ. 35-45 కోట్లు.

Sara Ali Khan

పటౌడీ సంస్థానంలో వందల కోట్ల ఆస్తులు కలిగిన సారా అలీ ఖాన్ అత్యంత డిమాండ్ ఉన్న యువ కథానాయికగా పాపులరైంది. జాన్వీ.. అనన్యల కంటే ఈ బ్యూటీ ఎక్కువ పారితోషికం అందుకుంటోంది. రూ.5 నుంచి రూ.7 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సారా నికర సంపాదన విలువ రూ.40-50 కోట్లు.

Ahan shetty

మరోవైపు తెలుగు సినిమా ఆర్.ఎక్స్ 100 రీమేక్ `తడప్`తో అరంగేట్రం చేశాడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి. ఈ ప్రాజెక్ట్ కోసం  రూ.80 నుంచి రూ.90 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నాడట. అతడి నికర ఆస్తుల విలువ దాదాపు రూ. రూ.28 నుంచి రూ.32 కోట్లు.

Ishan khatter

 జాన్వీ కపూర్ తో కలిసి బీ టౌన్ లో తెరంగేట్రం చేశాడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్. ఈ హీరో ఒక్కో సినిమాకు దాదాపు రూ.60 నుంచి రూ.80 లక్షలు తీసుకుంటున్నట్లు టాక్. ఈ హీరో నికర విలువ దాదాపు రూ.11 నుంచి రూ.15 కోట్ల రూపాయలు.

ఇలా సంపాదన లో ఆఫర్లలో బాలీవుడ్ స్టార్ కిడ్స్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. అబ్బాయిల కంటే డబుల్ సంపాదిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here