Unstoppable 2 with NBK : బాలయ్య గూటికి హీరోయిన్లు.. ఆట మాములుగుండదు..దబిడిదిబిడే..

- Advertisement -

Unstoppable 2 with NBK : నందమూరి హీరో బాలకృష్ణ గురించి అందరికి తెలుసు..ఎక్కడ నెగ్గాలో కాదు..తగ్గేవాడు బాలయ్య బాబు అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి..ఎప్పుడూ సీరియస్ లుక్ లో కంపిస్తూ సినిమాలు,రాజకీయాల్లోకి మాత్రమే పరిచయం అయిన ఈయన ఆహా లో అన్ స్టాపబుల్ షో చేస్తున్నారు. ఆ షో లో బాలయ్య చాలా సరదాగా ఉంటూ వచ్చిన గెస్ట్ ల గురించి జనాలకు తెలియజెస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు..మొదటి షో జనాల్లొ విపరీతమైన బజ్ ను ఏర్పాటు చేసుకున్నారు..ఇప్పుడు సీజన్ 2 ప్రసారం అవుతుంది.

Unstoppable 2 with NBK
Unstoppable 2 with NBK

బాలయ్య హోస్ట్గా చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది..షో ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుందో, ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, వీడియోలు రిలీజ్ అయినప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తుండటంతో ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రభాస్ నుంచి బాలయ్య ఎటువంటి నిజాలను రాబట్టారు అని డార్లింగ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

prabahs

ఇది ఇలా ఉండగా.. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ షోకు రాబోతున్నారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉందన్న విషయం తెలిసిందే..తాజాగా ఎపిసోడ్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తుండటంతో ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ తో ఈ షోకు రాబోతున్నారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది..

- Advertisement -

కాగా, తాజాగా ఈ టాక్ షో నెక్ట్స్ ఎపిసోడ్‌కు రాబోయే గెస్టుల గురించి ఆహా క్లూ ఇచ్చింది. అన్ స్టాపబుల్ 2 టాక్ షోలో ఏకంగా ముగ్గురు అందాల హీరోయిన్లు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా ఈ టాక్ షోలో గెస్టులుగా రాబోతున్నట్లు ఆహా తన సోషల్ మీడియాలో క్లూ ఇచ్చింది.

ఇక బాలయ్య ఈ ముగ్గురితో ఎలాంటి ఆసక్తికర విషయాలను చర్చిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో బాలయ్యతో ఈ హీరోయిన్లు ఎలాంటి సందడి చేయబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. హీరోయిన్ల సీక్రెట్స్ బయట పెడుతూ ఎంత రచ్చ చేస్తారో చూడాలి మరి..


Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here