Sara – Subhaman Gill : క్రికెటర్​తో ప్రేమలో పడ్డ బాలీవుడ్ బ్యూటీ.. కన్ఫామ్ చేసిన యంగ్ ప్లేయర్..!

- Advertisement -

Sara – Subhaman Gill – బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, నటి అమృతా సింగ్​ల కూతురిగా హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సారా అలీఖాన్. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ కలిసి కేదార్​నాథ్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సింబా, కూలీ నెం.1, లవ్ ఆజ్ కల్ 2, లేటెస్ట్​గా అత్రంగీ రే సినిమాలతో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది.

తీసినవి అరడజను సినిమాలే అయినా ఈ బ్యూటీ తన రిలేషన్​షిప్స్ వల్ల తరచూ లైమ్​ లైట్​లో ఉంటుంది. సినిమాల్లోకి రాకముందు ఓ రాజకీయనేత మనవడితో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత ఆ రిలేషన్​షిప్​కి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్​ హీరో ఇషాన్ ఖత్తర్​తో లవ్​లో పడినట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.

Sara - Subhaman Gill
Sara – Subhaman Gill

ఇక తన ఫస్ట్ కోస్టార్ సుశాంత్ సింగ్ రాజ్​పుత్ తనకు ఎప్పుడూ స్పెషలే అని చెప్పే సారా.. అతడితోనూ కొంతకాలం ప్రేమాయణం సాగించింది. ఏమైందో ఏమో మధ్యలోనే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత సుశాంత్ వేరే హీరోయిన్​తో ప్రేమ, ఆత్మహత్య ఆ సంగతులన్నీ తెలిసినవే.

- Advertisement -

సుశాంత్ తర్వాత తన మరో కో స్టార్ కార్తీక్ ఆర్యన్​తో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ జంట తరచూ కలిసి కనిపించడం.. ఓ టాక్ షోలో సారా ఎవరితో డేటింగ్ ఓకే అంటే కార్తీక్ పేరు చెప్పడంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. కొంతకాలానికే ఈ రిలేషన్​షిప్​కూ బ్రేక్ పడింది.

కార్తీక్​తో రిలేషన్​ తర్వాత సారా చాలా రోజులు సింగిల్​గానే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్​గా తను మళ్లీ రిలేషన్​షిప్​లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి తన కో స్టార్ కాదండోయ్. అతడో ఇండియన్ స్టార్ క్రికెటర్. సారా అలీఖాన్-యంగ్ క్రికెటర్ శుభమన్​ గిల్​ తరచూ ఇద్దరు డిన్నర్ డేట్స్​కి వెళ్లడం వల్ల వీరు రిలేషన్​షిప్​లో ఉన్నట్లు పుకార్లు మొదలయ్యాయి.

అయితే వీరు రిలేషన్​షిప్​లో ఉన్న మాట నిజమేనని ఇటీవల ప్రూవ్ అయింది. యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్​ షోలో పాల్గొన్నాడు. ఈ షో యాంకర్​ గిల్​ను.. సారా అలీఖాన్ తో మీరు డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్న అడగ్గా నాకు తెలియదంటూ మాట దాటేశాడు. ఆ తర్వాత హోస్ట్ కాస్త ఒత్తిడి తేవడంతో ఇరుక్కున శుభమన్.. ‘నేను డేటింగ్ లో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు..’ అంటూ సమాధానమిచ్చాడు.

గిల్​ను ఇరకాటంలో పడేయాలని మళ్లీ యాంకర్​.. బాలీవుడ్​లో అత్యంత ఫిట్​గా ఉండే నటి ఎవరని ప్రశ్నించగా.. దీనికి శుభమన్ ‘సారా’ అంటూ బదులిచ్చాడు. దీంతో సారాతో డేటింగ్ విషయాన్ని శుభమన్ చెప్పకనే చెప్పేశాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

గతంలోనూ శుభమన్ గిల్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్​తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది. ఆ మధ్య వీరిద్దరు ఒకరి ఇన్ స్టాను ఒకరు ఫాలో అవడం.. ఫొటోలు పరస్పరం షేర్ చేసుకోవడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే టాక్ కొన్ని నెలలపాటు నడిచింది.

కొద్ది రోజుల తర్వాత శుభమన్ గిల్ ‘దేవతలతో ప్రేమలో పడొద్దు’ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. వీరివురి మధ్య బ్రేకప్ అయిందనే పుకార్లు వచ్చాయి. రీసెంట్​గా తరచూ సారా అలీ ఖాన్​తో డిన్నర్ డేట్స్​కి వెళ్తుండటంతో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే ప్రచారం జోరందుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here