Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ కు కోట్ల ఆస్తులు.. ఎవరూ ఊహించని మ్యాటర్ బయటపెట్టిన అతడి తండ్రి..



Pallavi Prashanth : మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలతో తెగ పాపులర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డనంటూ, రైతుల కష్టాలు చెప్పుకుంటూ వేలల్లో వీడియోలు చేశాడు. అందులో బిగ్ బాస్‍కి వెళ్లాలంటూ కోరాడు. దీంతో బిగ్ బాస్ రియాలిటీ షో చరిత్రలో తొలిసారి ఓ రైతుబిడ్డగా హౌజ్‍లో అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. అయితే హౌజ్‌లో రైతు బిడ్డగా ఎంటర్ అయిన ప్రశాంత్‍కు ఫ్యాన్ బేస్ ఎక్కువే. అయితే, పల్లవి ప్రశాంత్‍కు 26 ఎకరాల భూమి, నాలుగు అత్యంత ఖరీదైన కార్లు, కోట్ల ఆస్తి ఉందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Pallavi Prashanth
Pallavi Prashanth

ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ తండ్రి రియాక్ట్ అయ్యారు. “మా గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు. 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవంతి ఉన్నాయంటున్నారు. నిజంగా అవన్నీ ఉంటే నా కొడుకు బిగ్ బాస్‍కు ఎందుకు వెళ్తాడు. నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు. అసలు 26 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో చూపించండి. నాకున్నదల్లా 6 ఎకరాల పొలం మాత్రమే. దాన్ని పంచితే ప్రశాంత్‍కు వచ్చేది రెండు ఎకరాలు. రైతులను ఎప్పుడూ చిన్న చూపే చూస్తారు.

కానీ, పెద్ద చూపు చూడరు” అని చెప్పుకొచ్చారు. “బిగ్ బాస్ హౌజ్‍లో నా కొడుకుని చులకన చేస్తూ మాట్లాడుతుంటే బాధేసింది. ఒకవేళ నా కొడుకు బిగ్ బాస్ గెలిస్తే వాడు చెప్పినట్లుగా ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకొటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్ల ముందే ప్రాణాలు విడిచారు. వారు పడే కష్టాలు ఏంటో.. కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసు” అని ప్రశాంత్ తండ్రి ఎమోషనల్ అయ్యారు.