Big Boss : బిగ్ బాస్ చేసిన పనికి తట్టుకోలేక కేకలు పెట్టి ఏడ్చిన శోభా శెట్టి.. పగపట్టాడుగా పాపం..



Big Boss : బిగ్‏బాస్ సీజన్ 7.. ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగానే ఈసారి ఆట అంతా ఉల్టా పుల్డాగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈసారి కేవలం 14 మందితోనే ఆట మొదలుపెట్టాడు బిగ్‏బాస్. అందులో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు హౌస్ లో 12 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఎప్పటిలాగే కాకుండా ఈసారి హౌస్ కంటెండర్ అయ్యేందుకు పోటీ పెట్టాడు బిగ్‏బాస్.

Big Boss
Big Boss

ఇప్పటికే పవర్ అస్త్ర గెలుచుకుని సందీప్ మొదటి కంటెండర్ కాగా.. ఆ తర్వాత రెండవ కంటెండర్‏గా శివాజీ నిలిచాడు. ఇక ఇప్పుడు మూడో కంటెండర్ అయ్యేందుకు పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. అమర్‎దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‏లను బిగ్‏బాస్ స్వయంగా సెలక్ట్ చేయగా.. ఇప్పుడు ఆ ముగ్గురి మధ్య పోటీ పెడుతున్నాడు. ఇక చికెన్ తినిపించి మరీ శోభాకు చుక్కలు తినిపించాడు బిగ్‏బాస్. అత్యంత ఎక్కువ కారం ఉన్న చికెన్ ఇచ్చి వాటిని తిని తాను అర్హురాలినే అని విషయాన్ని ప్రకటించుకోవాలని అన్నారు బిగ్‏బాస్.

ముందుగా ఎంతో కాన్ఫిడెంట్ గా చికెన్ తినడానికి రెడీ అయిన శోభా ఆ తర్వాత కారం భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది. ఏడుస్తూనే కారం చికెన్ తినడానికి ప్రయత్నించింది. ఏడ్వను అని అమ్మకు మాటిచ్చాను కానీ తప్పడం లేదు అంటూ మాట్లాడుతునే మంట భరించలేక అల్లాడిపోయింది. చివరకు కారం తగ్గించుకునేందుకు టిష్యూను నోటిలో పెట్టుకుని మంట తగ్గించేందుకు ప్రయత్నించింది. ఇక శోభా టాస్క్ తర్వాత ఆమెను అనర్హురాలు అని చెప్పిన ప్రశాంత్, శుభ శ్రీ, గౌతమ్‏లకు మళ్లీ చికెన్ టాస్క్ ఇచ్చారు.