Ashu Reddy : వేణు స్వామితో అలాంటి పూజలు చేయించుకుంటూ దొరికిపోయిన అషు రెడ్డి.. ఏకంగా కాళ్లు మొక్కుతుందిగా..!

- Advertisement -

Ashu Reddy : సినీ సెల‌బ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యాల‌ను చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్య‌క్తి వేణు స్వామి. ఆయ‌న జ్యోతిష్యం చెప్ప‌టంతో పాటు సెల‌బ్రిటీల ఇళ్ల‌లో పూజ‌లు, యాగాలు కూడా నిర్వ‌హిస్తుంటారు. ఆయన చెప్పినవి చెప్పినట్లు నూటికి 90 శాతం జరుగుతున్నాయి. దీంతో ఆయన చెప్పే జాతకాలపై జనాలతో పాటు సెలెబ్రిటీలకు కూడా నమ్మకం ఏర్పడింది.

Ashu Reddy
Ashu Reddy

ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు లేదా రాకుండా ఉండటానికి వేణు స్వామిని ఆశ్రయిస్తున్నారు.చిన్న చిన్న నటుల దగ్గరినుంచి స్టార్‌లు కూడా ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు. ఎక్కువగా హీరోయిన్లు పూజలు చేయించుకుంటున్నారు. గతంలో రష్మిక మందన్నా, డింపుల్‌ హయాతీ, నిధి అగర్వాల్‌లు వేణు స్వామితో ఇంట్లో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడీ వరుసలోకి ప్రముఖ నటి అషురెడ్డి చేరిపోయారు. తాజాగా, ఆమె వేణుస్వామితో ఇంట్లో పూజలు చేయించారు. ఇంట్లో వేణు స్వామి యాగం స‌హా ఏవో పూజ‌లు నిర్వ‌హించారు.

Ashu Reddy Venu swamy

అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇలా ఈ హీరోయిన్ ఇంట వేణు స్వామి ఇలా ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హించ‌టానికి కార‌ణం.. ఆమె జాతకంలో ఏదైనా దోషం ఉండి ఉండొచ్చు. వాటి నివార‌ణ‌కే ఉంటుంది. ఇక ఈ వీడియోలో అషు రెడ్డి వేణు స్వామి కాళ్లకు మొక్కడం హైలైట్ గా నిలిచింది. అలాగే ఆమె మెడలో వేణు స్వామి దండ కూడా వేశారు. ఇక ఆమె ఎడమ చేత్తో హారతి ఇవ్వడంతో ఇదేం పూజ అని అందరూ అనుకుకంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here