Meena : అందరి ముందు పరిగెత్తుకుంటూ వెళ్లి వెంకటేష్ కు ముద్దు పెట్టిన మీనా.. భయపడిన హీరో..

- Advertisement -

Meena గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా సీతారామయ్య గారి మనవరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే నాగేశ్వరరావు తో పాటు ధీటుగా నటించి మెప్పించడంతో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. అలా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సాగర్ ను వివాహమాడి సినిమాలకు కొన్నేళ్లు బ్రేక్ ఇచ్చింది. మీనా కు ఒక పాప.

Meena
Meena

తనలానే తన కూతురును కూడా బాలనటిగా మార్చింది. ఇక గతేడాది మీనా జీవితంలో మర్చిపోలేని విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ఆమె భర్త సాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక భర్త చనిపోయాక ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని తట్టుకొని.. కూతురు కోసం మళ్ళీ నటించడం మొదలుపెట్టింది. తాజాగా మీనా జడ్జిగా కూడా మారింది. సెలబ్రిటీ రీల్ వర్సెస్ రియల్ కపుల్స్ తో జీ తెలుగులో సూపర్ జోడీ అనే డ్యాన్స్ షో మొదలయ్యింది. హీరోయిన్ శ్రీదేవి, మీనా, రఘు మాస్టర్ జడ్జి ల్లా వ్యవహరిస్తున్న ఈ షో కు ఉదయభాను యాంకర్ గా వ్యవహరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ డ్యాన్స్ షో సక్సెస్ ఫుల్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ స్టేజిపై మీనా నటించిన చంటి సినిమాలోని ఎన్నెన్నో అందాలు సాంగ్ ను రీక్రియేట్ చేశారు.

Daggubati venkatesh Meena

దీంతో మీనా అప్పటి రోజులను గుర్తుచేసుకుంది. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. 1991 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక క్లైమాక్స్ లో మీనా గాజు ముక్కలపై పరిగెడుతూ వచ్చి వెంకటేష్ ను ముద్దుపెట్టుకుంటుంది. తాను అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ముద్దు పెట్టేసరికి వెంకటేష్ భయపడ్డాడని మీనా చెప్పుకొచ్చింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, మీనా ఎన్నో సినిమాలు చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here