‘Salaar’ చిత్రం లో ‘జాంబీలు’ కూడా ఉన్నాయా..ప్రశాంత్ నీల్ ఇచ్చే క్రేజీ ట్విస్ట్ కి ఫ్యాన్స్ ఏమైపోతారో!

- Advertisement -

Salaar : ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 22 వ తారీఖున రావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కార్యక్రమాలు వల్ల డిసెంబర్ 22 వ తారీఖుకు వాయిదా పడింది. సినిమాలో అతి ముఖ్యమైన సన్నివేశాలు బాగా రాకపోవడం తో రీ షూట్ ని ప్లాన్ చేసారు.

Salaar
Salaar

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ షూటింగ్ జరుగుతుంది. అంతే కాకుండా సినిమాలో ఒక కొత్త సన్నివేశం కూడా యాడ్ చేశారట. ఈ సన్నివేశం కలిపాక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంతృప్తి చెందాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఫ్యాన్స్ ఊహించని ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. ఈ చిత్రం లో విలన్ గ్యాంగ్ లో పని చేసిన ఒక ఆర్టిస్ట్ ఫ్యాన్స్ కి ఫ్యూకులు ఎగిరిపోయి ట్విస్ట్ ని రెవీల్ చేసాడు.

అదేమిటంటే ఈ చిత్రం లో ప్రభాస్ జాంబీలతో ఫైట్ చేస్తాడట. జాంబీ అంటే శరీరాకృతి ఉన్న దెయ్యాలు అన్నమాట. ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి దీని అర్థం తెలుస్తుంది. లేకుంటే ‘జాంబీ రెడ్డి’ సినిమా చూసినా అర్థం అయిపోతుంది. అసలు సలార్ కి, జాంబీలకు సంబంధం ఏమిటి?. ఇన్ని రోజులు కేవలం యాక్షన్ సినిమా మాత్రమే అని అనుకుంటూ వచ్చిన జనాలకు ప్రశాంత్ నీల్ ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ సర్ప్రైజ్ లు ఇవ్వబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఈ సినిమాకి పని చేస్తున్నవాళ్ళు.

- Advertisement -

వచ్చే నెల 23 వ తారీఖున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు. ఈ ట్రైలర్ లోనే ఆ జాంబీ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి అది ఎంత వరకు నిజం అనేది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ ముఖ్య పాత్ర పోషించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here