‘Skanda’ 3 రోజుల వసూళ్లు..ఓవర్సీస్ లో ‘సున్నా’ షేర్..?

- Advertisement -

Skanda : ఎనెర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ‘స్కంద’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ భారీ కాంబినేషన్ సినిమా కావడం తో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజు మాత్రమే కాకుండా, మూడు రోజుల వరకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి.

Skanda
Skanda

ఫలితంగా మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 18 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణ లో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను దక్కించుకుంది. ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ సినిమాని దాదాపుగా 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి ఇక్కడ 6 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. అంటే 50 శాతం కి పైగా రికవరీ అన్నమాట. అలాగే సీడెడ్ లో 2 కోట్ల 25 లక్షలు, ఉత్తరాంధ్ర లో కోటి 97 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 9 లక్షల రూపాయిలు,వెస్ట్ గోదావరి జిల్లాలో 73 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 75 లక్షల రూపాయిలు,నెల్లూరు జిల్లాలో 72 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో కోటి 56 లక్షల రూపాయిలు వచ్చాయి.

- Advertisement -

అంటే మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 15 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు కోటి 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ నిన్న మాత్రం ఈ సినిమాకి సున్నా షేర్ వచ్చింది. అలా మొత్తం మీద ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 18 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here