Prabhas : ప్రభాస్ ను కూడా వదలని శ్రీలీల.. రొమాన్స్ కు విజయ్ దేవరకొండ వద్దు ప్రభాసే కావాలట..!

- Advertisement -

టాలీవుడ్‍లో ప్రస్తుతం సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ఫుల్ బిజీగా ఉన్నారు. స్కంద, గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్జినరీ మ్యాన్ సహా మరిన్ని చిత్రాల్లో శ్రీలీల నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్‍సింగ్‍ కోసం కూడా టాక్స్ జరుగుతున్నాయి. ఇలా చేతి నిండా చిత్రాలతో శ్రీలీల చాలా బిజీగా ఉంటున్నారు.

Prabhas
Prabhas

డేట్స్ లేక కొన్ని చిత్రాలకు కూడా ఆమె నో చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, శ్రీలీలకు తన కెరీర్లోనే బంపర్ ఛాన్స్ వచ్చేస్తుందని టాక్ బయటికి వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేయబోయే తర్వాతి సినిమాలో హీరోయిన్‍గా శ్రీలీల నటించనుందని రూమర్లు బయటికి వచ్చాయి. సీతారామం చిత్రంతో సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ హను రాఘవపూడి కొన్ని నెలల క్రితం ప్రభాస్‍కు ఓ కథ వినిపించారనే సమాచారం బయటికి వచ్చింది. ప్రపంచ యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీగా ఈ కథ ఉన్నట్టు టాక్.

ఇప్పుడు ఈ సినిమాలోనే ప్రభాస్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా ఎంపిక కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే శ్రీలీల కెరీర్ మరోస్థాయికి వెళుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరారు లీల. ప్రభాస్‍తో నటిస్తే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‍గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌ కూడా బాగా చేస్తారు లీల. ఇది ఆమెకు పెద్ద ప్లస్‍గా ఉంది. అలాగే ఈ భామ విజయ్ దేవరకొండ సినిమా నుంచి తప్పుకుందట. విజయ్ కంటే ప్రభాస్ అయితే బాగుంటుందని అనుకుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here