ఉత్తరాది భామతో అల్లు హీరో రొమాన్స్.. ఇంత హాట్‌గా ఉన్న అమ్మాయితోనే..!ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల “ఊర్వశివో రాక్షసివో” చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శిరీష్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినీ పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతుంది. ఈ సినిమాకి ‘బడ్డీ’ అనే పేరును ఖరారు చేశారు. ‘బడ్డీ’ని ప్రముఖ నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. దీనికి హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.

అల్లు శిరీష్
అల్లు శిరీష్

ఇటీవల అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. ఇక ‘బడ్డీ’లో అల్లు శిరీష్ సరసన నార్త్‌ ఇండియా భామ ప్రిషా సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నిఖిల్ ‘స్పై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారామె. అందులో ప్రిషా సింగ్ ఓ రోల్ చేశారు. ఇక ‘బడ్డీ’ సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకున్నారు.

‘బడ్డీ’ సినిమాలో గగనసఖి అనే ఎయిర్ హోస్టెస్ పాత్రలో Prishaa singh నటిస్తున్నారు. దీనికోసం ఆమె తెగ కష్టపడుతున్నారట. ఎయిర్‌ హోస్టర్ల వ్యవహార శైలి, మాట తీరు వంటివి తెలుసుకుంటున్నారట. తరచూ విమానాల్లో ప్రయాణిస్తూ వాళ్లతో మాట్లాడుతూ దగ్గరుండి మరీ పరీక్షిస్తున్నారట. పాత్ర కోసం కొంత ప్రిపేర్ అయ్యానని ప్రిషా సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు కూడా బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇంత హాట్‌ భామతో శిరీష్ రొమాన్స్ చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక అల్లు శిరీష్‌ ఇప్పటికే “ఊర్వశివో రాక్షసివో” చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్‌లో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే.