‘ఊర్వశివో రాక్షసివో’.. ఆ సీన్లే సినిమాను హిట్ చేశాయా..?

- Advertisement -

‘ఊర్వశివో రాక్షసివో’.. దాదాపు మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన సినిమా. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్ కి ఈ మూవీ మంచి ఫలితాన్ని అందించింది. రాకేష్ శశి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2పై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మోగిలినేని విజయ్ నిర్మించిన ఈ సినిమాలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి యూత్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ మూవీలో లవ్ సీన్స్.. ఇంటిమేట్ సీన్స్.. కాస్త అడల్ట్ కంటెంట్.. ఉండటంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఏ సీన్స్ అయితే యూత్ ని థియేటర్లకు రప్పిస్తాయో అలాంటి సీన్స్ ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. మోతాదుకు మించిన ఇంటిమేట్ సీన్స్.. లెక్కకు మించి లిప్ లాక్ సీన్స్ ఉండటంతో ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు రావడం కాస్త కష్టమే.

- Advertisement -

ఫస్ట్ డే పెద్దగా ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయిన ఇవాళ మంచి టాక్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా థియేటర్లో విడుదలవ్వడంతో మూవీ సర్కిల్ లో ఓ టాక్ నడుస్తోంది. ఈ మూవీ హిట్.. మరికొందరి డైరెక్టర్లకు దారి చూపుతుందా.. వారు అడల్ట్.. ఇంటిమేట్ కంటెంట్ పై ఫోకస్ చేస్తాయా.. మళ్లీ సినిమాలు మూసధోరణిలో వెళ్తాయేమోనన్న చర్చ నడుస్తోంది. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టాక్ చూస్తుంటే.. మళ్లీ ఈ తరహా ఏ రేటెడ్ సినిమాలు జోరందుకునేలా వున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here