Alia Bhatt : పూల ఫ్రాక్ లో పులకరించిపోతున్న ఆలియా భట్

- Advertisement -

Alia Bhatt ప్రజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఓ సెన్సేషన్. మహేశ్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నెపో కిడ్.. తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకుంది. మహేశ్ భట్ కేవలం తనకు ఎంట్రీ పాసేనని.. తను సాధించిన ఘనత అంతా తన టాలెంట్, హార్డ్ వర్క్ తోనేని చాటి చెప్పింది. 

Alia Bhatt
Alia Bhatt

గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా కెరీర్ తొలినాళ్లలోనే ఈ భామ హైవే వంటి సినిమాలో నటించి నటనలో తన టేస్ట్ ఏంటో.. తన యాక్టింగ్ సత్తా ఏంటో అందరికి ప్రూవ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఓ వైపు ఎంటర్న్టైన్ మెంట్ అందించే సినిమాలు చేస్తూనే.. మరోవైపు కల్ట్ సినిమాలతో అలరిస్తోంది.

Alia

ఈ బ్యూటీకి ప్రస్తుతం చేతినిండా పనే. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా ప్రస్తుతం తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతోంది. నెమ్మదిగా వర్క్ లైఫ్ లోకి మళ్లీ అడుగుపెడుతోంది. తను ఒప్పుకున్న ప్రాజెక్టుల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఓ మేగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది.

- Advertisement -
Bhatt

ఎల్లే మేగజైన్ కోసం ఆలియా భట్ చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిడ్డ పుట్టినా కూడా ఆలియా అందం ఏమాత్రం తగ్గకపోగా.. రెట్టింపు అయిందంటూ నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు. ఆలియా ఎంత అందంగా ఉందోనంటూ తెగ మురిసిపోతున్నారు. తమ ప్రేమనంతా కామెంట్ల రూపంలో కురిపిస్తున్నారు.

ఈ మేగజైన్ ఫొటోషూట్ లో ఆలియా వివిధ రకాల ఔట్ ఫిట్స్ లో కనిపించింది. వైట్ కలర్ పూల ఫ్రాక్ లో ఆలియా చాలా ముద్దుగా కనిపిస్తోంది. సిల్వర్, గోల్డెన్, పింక్ కలర్ గౌనుల్లో ఆలియా భలే అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండింగ్ ఔట్ ఫిట్స్ లో ఆలియా కిల్లింగ్ పోజులిచ్చిన ఆలియా కుర్రాళ్ల మనసు మరోసారి దోచేసింది.

ఇక ఆలియా భట్ ఇటీవలే రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో జోయా అక్తర్ డైరెక్షన్ లో కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలతో కలిసి జీ లే జరా సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here