Rana Naidu Review .. బాబాయ్ అబ్బాయిలు మెప్పించారా.?

- Advertisement -

Rana Naidu : ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది.. ఓకే సినిమాలో ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తే ఆ చిత్రానికి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు భారీ హిట్ కూడా అందుకుంటుంది.. ఆ ఇద్దరు స్టార్స్ కూడా రియల్ లైఫ్ లో బంధువులు అయితే ఆ క్రేజీ కాంబినేషన్ కి వంకే పెట్టక్కర్లేదు పేరుకి బాబాయి అబ్బాయిలైనా వెంకటేష్ రానాలు మొదటిసారి ఓ వెబ్ సిరీస్ లో కలిసి పూర్తిస్థాయిలో నటించారు.. రానా నాయుడు వెబ్ సిరీస్ నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది బాబాయి – అబ్బాయిలు ఏ మేరకు మెప్పించారో ఇప్పుడు చూద్దాం..

rana naidu review
rana naidu review

కథ:

బాలీవుడ్ లో వచ్చే స్కాండిల్ ని ఈజీగా ఫిక్స్ చేస్తుంటాడు రానా నాయుడు ( రానా). ఇక సెలబ్రిటీలే అతన్ని పెంచి పోషిస్తుంటారు. తన క్లైయింట్స్ ను సేవ్ చేయడానికి రానా ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే క్షణాల్లో పరిష్కారం ఇచ్చే రానా తండ్రి నాగానాయుడు (వెంకటేష్) పెద్ద సమస్యగా మారతాడు.. ఈ కథలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే నాగానాయుడిని జైలుకు పంపించింది రానా.. అసలు రానా ఎందుకు నాగానాయుడిని జైలుకు పంపిస్తాడు.. ఆ విషయాన్ని తెలుసుకున్న నాగానాయుడు రానాతో ఎలా రియాక్ట్ అవుతాడు.. అందరితో ప్రేమగా ఉండే రానా ఎందుకు నాగానాయుడితో అంతా కఠినంగా ఉండాల్సి వచ్చింది.. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే..

rana naidu

2013లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సిరీస్ రే డోంట్ వాంట్ కు రీమేగా రానా నాయుడు వెబ్ వచ్చింది. ఇంగ్లీష్ వాళ్లకి ఈ వెబ్ సిరీస్ నచ్చిన కానీ తెలుగు వారికి మాత్రం రానా వెంకటేష్ పాత్రలు కాస్త రుచించవనే చెప్పాలి. రెండు ఎపిసోడ్లు చూసేదాకా అసలు స్టోరీలైన అర్థం కాదు. పైగా ఈ కథ ఎటువైపు ములుపు తిరుగుతుంది. అసలు కథ ఏంటి తెలియడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఈ కథలోని క్యారెక్టర్స్ మాత్రం మనసుకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. సూటిగా చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ లో హీరో ఎవరో, విలన్ ఎవరో కూడా అర్థం కారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి.. ఒకరిని ఒకరు ఎందుకు ద్వేషించుకుంటారు అనేది తెలియాలి అంటే ఈ వెబ్ సిరీస్ లోని పాత్రలకు మనం కనెక్ట్ కావాలి.. లేదంటే హాలీవుడ్ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చూస్తే ఎలా ఉంటుందో అలాంటి భావనే కలుగుతుంది.

- Advertisement -

సినిమాకైనా వెబ్ సిరీస్ కైనా క్లైమాక్స్ ముఖ్యం డైరెక్టర్ బలమైన పాయింట్ తో క్లైమాక్స్ ను మాత్రం అద్భుతంగా రాశారు. ముందు 8 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనే దానికంటే కూడా వాటిలోని బలాబలాలు కంటే క్లైమాక్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ ని ఆకాశానికి ఎత్తేసిందని చెప్పొచ్చు . ఈ వెబ్ సిరీస్ మీరు చివరి వరకు చూస్తే కనుక మంచి ఫీల్ గుడ్ మెసేజ్ అని మాత్రం అర్థమవుతుంది. చిన్న చిన్న పాత్రలు అందులో ఎందుకు వస్తాయో ఎందుకు వెళ్ళిపోతాయో కూడా తెలియదు. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ వెబ్ సిరీస్ రావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే నిర్మాణ విలువలు కూడా ఉన్నాయి. వెంకటేష్ ఎప్పటిలాగే తన పర్ఫామెన్స్ తో ఇరగ తీశారు రానా నటన ఈ వెబ్ సిరీస్ కి హైలెట్ గా నిలిచింది. ఇక స్టోరీ లైన్ కూడా విభిన్నంగా ఉంది. అందరినీ ఆకట్టుకుంటుంది కూడా.. చిన్నచిన్న లోపాలు తప్పించి.. ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here