Bollywood Beauty : పెళ్లికి ముందే నేను ప్రెగ్నెంట్.. అయితే ఏంటి..?.. బాలీవుడ్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్

- Advertisement -

Bollywood Beauty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్- స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గతేడాది ఏప్రిల్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ పాపకు వీళ్లు రాహా అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం ఆలియా తన మదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తూ.. నెక్స్ట్ సినిమాల కోసం ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తోంది. ప్రజెంట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. 

Bollywood Beauty
Bollywood Beauty

ఆలియా-రణ్ బీర్ ల పెళ్లై ఎనిమిది నెలలకుపైనే అయింది. ఇంతలోనే వీరికి పండంటి బిడ్డ పుట్టింది. పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అలియా భట్ ఈ గుడ్ న్యూస్ విని చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ కొందరు మాత్రం పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అయిందని.. అందుకే తొందరగా పెళ్లి చేసుకుంది విమర్శించడం మొదలుపెట్టారు. 

Actress Alia Bhatt
Actress Alia Bhatt

ఆ సమయంలో ఆలియా భట్ ప్రగ్నెన్సీ మ్యాటర్.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. పండంటి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొందరు ఆలియా భట్ పై ట్రోలింగ్ చేయడం మానలేదు. రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆలియా తన ప్రగ్నెన్సీపై వచ్చిన పుకార్లు, ట్రోల్స్ పై స్పందించింది. ఓ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 

- Advertisement -

పెళ్లికి ముందు తాను ఓ హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని అప్పుడే తాను ప్రగ్నెంట్ అనే విషయం తెలిసిందని ఆలియా చెప్పింది. యాక్షన్ సీన్స్ చేయడానికి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని.. చిత్ర బృందానికి విషయం చెప్పడంతో వాళ్లు అన్ని జాగ్రత్తలతో షూట్ ప్లాన్ చేశారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అలాగే తాను పెళ్లికి ముందు గర్భవతి కావడంపై వస్తున్న ట్రోల్స్ పై కూడా రియాక్ట్ అయింది. పెళ్లికి ముందే ప్రగ్నెంట్ అవ్వడంలో తప్పేం లేదని ఆలియా కామెంట్ చేసింది.

Bollywood Beauty
Bollywood Beauty

ఆలియా కామెంట్స్ తో తాను ప్రగ్నెంట్ అవ్వడం వల్లే పెళ్లి చేసుకుందన్న పుకార్లు నిజమేనని స్పష్టమవుతోందని మీడియా టాక్. ఈ టాపిక్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ముందే తొందరపడి తర్వాత పెళ్లి చేసుకుందని కొందరు మళ్లీ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. 

గంగూబాయ్ కతియావాడితో హిట్ అందుకున్న ఆలియా భట్ తన మొదటి హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగా తన సహ నటి గాల్ గాడోట్‌తో ఉన్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.  ప్రెగ్నెంట్ అయిన సమయంలోనే  ఆలియా తన మొదటి హాలీవుడ్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇక ఆలియా తొలి హాలీవుడ్ చిత్రం కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించారు. 

ప్రస్తుతం ఆలియా తల్లిగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. బిడ్డ పుట్టిన తర్వాత అంతా కొత్తగా ఉందని.. ఇంతకుముందు కంటే ఇప్పుడు తన ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. పెళ్లి, పిల్లల వల్ల హీరోయిన్ల కెరీర్ ఎండ్ అవ్వదని.. అవకాశాలు వచ్చినన్ని రోజులు తను సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పింది ఈ బ్యూటీ. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here