Pavitra Naresh పెళ్లిలో పెద్ద ట్విస్ట్.. అదంతా డ్రామానా?

- Advertisement -

Pavitra Naresh : సినీ నటుడు నరేష్, నటి పవిత్ర గత కొంత కాలంగా రిలేషన్‌షిప్‌ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. ఈ విషయం పై ఇటు సోషల్ మీడియాలో, అటు మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి.తాము ఒక్కటి కాబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. కొత్త ఏడాది సందర్భంగా తమ ప్రేమని వ్యక్తం చేస్తూ ఓ వీడియో క్లిప్ ని పంచుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే హింట్‌ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఊహించిన విధంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. డైరెక్ట్‌ గా పెళ్లి చేసుకున్న వీడియోని షేర్‌ చేశాడు నరేష్‌. వేద మంత్రాలు, పండితుల, అగ్ని సాక్షిగా పవిత్ర మెడలో మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడుస్తున్న వీడియోని పంచుకున్నారు నరేష్‌.. అది కాస్త కొన్ని గంటలు చాలా వైరల్ అయ్యింది..

Pavitra Naresh
Pavitra Naresh

ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్‌ అవుతుంది. అభిమానులంతా స్పందిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ఇప్పుడు లేటు వయసులో ఈ ఇద్దరి పెళ్లి నెట్టింట మాత్రమే కాదు, టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది..అయితే ఈ పెళ్లిలోనే పెద్ద ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. కనిపించేది నిజం కాదనే టాక్‌ వినిపిస్తుంది. పవిత్ర లోకేష్‌, నరేష్‌ల పెళ్లి నిజం కాదని అంటున్నారు. వారిని నిజం పెళ్లి కాదని, అందులో ఏదో ట్విస్ట్ ఉండి ఉండొచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.

ఇది ఓ సినిమా కోసం నరేష్‌, పవిత్ర ఆడిన డ్రామా అని తెలుస్తుంది. కొత్త సినిమా కోసం, సినిమాపై ముందస్తుగానే బజ్‌ క్రియేట్ చేయడం కోసం నరేష్‌, పవిత్ర ఇలా చేశారని టాక్.. ఎంఎస్‌ రాజు రూపొందించబోతున్న సినిమా కోసం ఇదంతా చేశారని తెలుస్తుంది. ఎంఎస్‌ రాజు రిలేషన్‌ షిప్‌ లవ్‌ స్టోరీ డ్రామా నేపథ్యంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారట. అందులో నరేష్‌, పవిత్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ సినిమాలోని సన్నివేశాలే ఇవి అని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని విడుదల చేయబోతున్నారట. అయితే దీనికి బలం చేకూరేలా నరేష్‌ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో జరిగే ఇంటింటి రామాయణంచిత్ర ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం విశేషం. నిజంగానే పెళ్లి చేసుకుంటే ఆయన ప్రెస్‌మీట్‌ కి ఎలా వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా నరేష్‌, పవిత్ర ఆడిన డ్రామా అంటున్నారు నెటిజన్లు..ఏదైతేం మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here